శ్వేత పత్రం విడుదలకు ‘పళణి’ డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

శ్వేత పత్రం విడుదలకు ‘పళణి’ డిమాండ్‌

Published Fri, Dec 8 2023 2:20 AM

పళణి స్వామి  
 - Sakshi

సాక్షి, చైన్నె: చైన్నెలో నిర్మించిన వర్షపు నీటి కాలువల నిర్మాణాలపై సమగ్ర సమాచారంతో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి డిమాండ్‌ చేశారు. చైన్నె వరద ముంపునకు గురైన నేపథ్యంలో వర్షపు నీటి కాలువల నిర్మాణాలపై ఆరోపణలు, విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి గురువారం స్పందించారు. ఆయన పేర్కొంటూ చైన్నెలో వర్షపు నీటి కాలువల నిర్మాణాలు సక్రమగా జరిగి ఉంటే, నగరం నీట మునిగి ఉండేది కాదన్నారు. గతంలో వాతావరణ కేంద్రం నుంచి తమకు సమాచారం అందగానే ముందు జాగ్రత్తులు సిద్ధం చేసి ఉంచామన్నారు. ఈ సారి ఐదు రోజులకు ముందుగానే వాతావరణ కేంద్రం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించినా, ఈ పాలకులు చివరి క్షణంలో స్పందించడంతో ప్రజలు అష్టకష్టాలు పడాల్సిన పరిసితి ఏర్పడినట్లు ఆరోపించారు. చైన్నె, శివారులలో వర్షపు నీటి కాలువల నిర్మాణాలపై అనుమానాలు బయలుదేరాయని, వీటిపై సమగ్ర సమాచారంతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వర్షం ఆగి నాలుగు రోజులు అవుతున్నా, శివారులు ఇంకా జల దిగ్బంధంలోనే ఉండడం ఈ పాలకుల అసమర్థకు నిదర్శనంగా పేర్కొన్నారు. అంటు రోగాలుప్రబలే పరిస్థితులు నెలకొని ఉన్నాయని తక్షణం వైద్య శిబిరాలను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, ఇంటింటా వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు పాలు, నిత్యావసర వస్తువులు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోకుండా, సహాయక చర్యల పేరిట మాయాజాలం సృష్టిస్తున్నారని విమర్శించారు.

Advertisement
Advertisement