యువ వైద్యుడి మరణానికి పని భారం కారణం కాదు | Sakshi
Sakshi News home page

యువ వైద్యుడి మరణానికి పని భారం కారణం కాదు

Published Wed, Dec 13 2023 5:04 AM

-

కొరుక్కుపేట: చైన్నెలోని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో యువ వైద్యుడు మరుదు పాండియన్‌ మృతికి పనిభారం కారణం కాదని ఆసుపత్రి స్పష్టం చేసింది. వివరాలు.. అరియలూర్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ మరుదు పాండియన్‌ (30) చైన్నె మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేశారు. అదే కళాశాలలో, అతను స్పెషలైజేషన్‌ వైద్య కోర్సుగా పేగు, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో చదివి వైద్య సేవలందిస్తున్నారు. ఈ కేసులో ఈనెల 10వ తేదీన ఇంటికి తిరిగి వచ్చిన వైద్యుడు మరుద పాండి మరుసటి రోజు ఉదయం శవమై కనిపించాడు. అనంతరం కేఎంసీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 24 గంటల పాటు నిరంతరం విధుల్లో ఉండడమే మృతికి కారణమని వైద్య సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ సందర్భంలో మరణించిన వైద్యుడు వారం రోజులుగా ఇంటర్న్‌ షిప్‌పై పనిచేశారు. కాగా మరణానికి ముందు అతడు ఆసుపత్రిలో కాలేయ మార్పిడికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. పోస్టుమార్టం తర్వాతే డాక్టర్‌ మరుదు పాండియన్‌ మృతికి గల కారణాలు తెలియనున్నాయి. అయితే మరుదుపాండియన్‌ 36 గంటలు పాటు నిర్విరామంగా విధుల్లో ఉన్నాడని రాజీవ్‌గాంధీ ఆసుపత్రి వివరించింది. అయినా పనిభారం ఆయన మృతికి కారణం కాదని పేర్కొనడం గమనార్హం.

– రాజీవ్‌ గాంధీ హాస్పిటల్‌

అధికారుల వివరణ

Advertisement
Advertisement