తెలుగు వికాస సమితి క్యాలెండర్‌ ఆవిష్కరణ | Sakshi
Sakshi News home page

తెలుగు వికాస సమితి క్యాలెండర్‌ ఆవిష్కరణ

Published Mon, Dec 25 2023 1:48 AM

 క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న తెలుగు వికాస సమితి నేతలు, కార్యకర్తలు  - Sakshi

తిరువళ్లూరు: తెలుగు వికాస సమితి 2024 నూతన తెలుగు క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని సిద్ధిరాజుకండిగ్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షుడు పోజుల ముద్దుకృష్ణుడు అధ్యక్షత వహించగా కార్యదర్శి వెలుగుల కృష్ణమోహన్‌నాయుడు ప్రారంభోపన్యాసం చేశారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో తెలుగు వికాసమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 2024 నూతన సంవత్సరం తెలుగు క్యాలెండర్‌ను తెలుగు వికాస సమితి ఆద్వర్యంలో తయారు చేశారు. ఈ క్యాలెండర్‌ను లయన్‌ రమేష్‌ ఆదివారం విడుదల చేశారు. తొలి ప్రతిని మధు మెడికల్స్‌ నిర్వాహకుడు సురేష్‌ అందుకున్నారు. అనంతరం తెలుగు వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజయం సాధించిన 16 మందికి డాక్టర్‌ ప్రణీత్‌వర్మ, డాక్టర్‌ షాలిని తదితరులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పీటీఏ అధ్యక్షుడు సుఽజాకర్‌, ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ధనలక్ష్మీ, గజేంద్రబాబు, వివేకానంద పాఠశాల కరస్పాండెంట్‌ మాచర్ల శాంతాభాస్కర్‌, నంది మండలం వెంకటరామరాజు, కిన్నెర ప్రకాష్‌, లయన్‌ రమేష్‌, మధు మెడికల్స్‌ నిర్వాహకుడు సురేష్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమంలో సమితి కోశాధికారి బొప్పన పద్మనాభం వందన సమర్పణ చేశారు.

Advertisement
Advertisement