8వ శతాబ్దానికి చెందిన కోట్రవై విగ్రహం లభ్యం | Sakshi
Sakshi News home page

8వ శతాబ్దానికి చెందిన కోట్రవై విగ్రహం లభ్యం

Published Sun, Feb 11 2024 1:06 AM

- - Sakshi

అన్నానగర్‌: ఉలుందూరుపేట సమీపంలో శనివారం 8వ శతాబ్దానికి చెందిన కోట్రవై విగ్రహం లభ్యమైంది. తిరువణ్ణామలై ప్రాంతానికి చెందిన చరిత్రకారుడు రాజ్‌ పన్నీర్‌సెల్వం, శ్రీధర్‌, తామరైకన్నన్‌లతో కూడిన బృందం కళ్లకురిచ్చి జిల్లాలోని ఉలుందూరుపేట, చుట్టుపక్కల గ్రామాలలో శనివారం క్షేత్రస్థాయి సర్వే చేసింది. అప్పుడు బిల్రంపట్టు గ్రామంలో చెట్లతో చుట్టుముట్టిన పొలంలో పలక రూపంలో రాతి శిల్పం కనుగొనబడింది. దీనిని పరిశీలించగా 8వ శతాబ్దానికి చెందిన పల్లవుల కాలం నాటి 5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగిన కోట్రవై విగ్రహమని తేలింది.

లభ్యమైన కోట్రవై విగ్రహం

Advertisement
Advertisement