18 ఏళ్లు నిండకుండానే తల్లులవుతున్న బాలికలు | Sakshi
Sakshi News home page

18 ఏళ్లు నిండకుండానే తల్లులవుతున్న బాలికలు

Published Mon, Feb 19 2024 6:32 AM

- - Sakshi

కొరుక్కుపేట: టీనేజ్‌ బాలికలు గర్భం దాల్చుతున్న అంశంలో రాష్ట్రంలోనే ధర్మపురి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గత మూడేళ్లలో ప్రభుత్వాసుపత్రుల్లో మొత్తం 8,742 టీనేజ్‌ ప్రసవాలు జరగగా, అందులో ధర్మపురి జిల్లాలోనే 3,429 మంది ఉన్నట్లు తేలింది. గత కొన్నేళ్లుగా బాలికలు గర్భం దాల్చే ఘటనలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆరోగ్యశాఖ అధికారులు సమాధానమిచ్చారు. ఇందులో చాలా షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి.

దాని ప్రకారం గత 3 ఏళ్లలో ధర్మపురిలో 3,249 మంది మైనర్లు పిల్లలకు జన్మనిచ్చినట్లు తేలింది. కరూర్‌కు ద్వితీయ స్థానం లభించగా, వేలూరుకు తృతీయ స్థానంలో నిలిచింది. ఇక చైన్నె, కోయంబత్తూర్‌, మదురై వంటి ప్రధాన నగరాలతో పోలిస్తే, ధర్మపురిలో బాలికలు అత్యధిక సంఖ్యలో గర్భిణులుగా పేర్లు నమోదు చేసుకుంటున్నట్లు వెల్లడైంది. దీంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రుల గణాంకాలను విశ్లేషిస్తే ఈ సంఖ్య 10 వేలకు మించి ఉంటుందని సమాచారం.

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు
బాలికలు గర్భం దాల్చుతున్న అంశంపై ఆరోగ్య శాఖ కార్యదర్శి గగన్‌ దీప్‌ సింగ్‌ బేడీ మాట్లాడుతూ టీనేజ్‌ గర్భం అనేది సామాజిక సమస్య. దీన్ని అరికట్టాలంటే రాష్ట్రవ్యాప్తంగా బాల్య వివాహాలను నిషేధించాలన్నారు. నిబంధనల ప్రకారం కేసులను పోలీసులు నమోదు చేశారని, ఈ కేసులను సమీక్షించాలని జిల్లా మేజిస్ట్రేట్‌లను కోరారు. అన్ని జిల్లాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఈ సమస్యకు ముగింపు పలకడానికి పోలీసులు, ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు చేతులు కలపాలన్నారు. దీని కోసం 1,098 టోల్‌ ఫ్రీ నంబర్‌తో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ను నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement