ప్రభుత్వ బస్సు కండక్టర్‌పై దాడి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బస్సు కండక్టర్‌పై దాడి

Published Thu, Mar 28 2024 2:05 AM

ప్రభుత్వ బస్సు కండక్టర్‌పై దాడి చేస్తున్న
ప్రైవేటు బస్సు సిబ్బంది    - Sakshi

అన్నానగర్‌: తంజావూరులో మంగళవారం ప్రయాణికులను ఎక్కించుకునే విషయంలో పోటీ పడి, ప్రభుత్వ బస్సు కండక్టర్‌పై ప్రైవేటు బస్సు డ్రైవర్‌, కండెక్టర్‌ దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. తంజావూర్‌ జిల్లా పట్టుకోట్టై అన్నా కాలనీకి చెందిన మారియప్పన్‌ (47) ప్రభుత్వ బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతను పట్టుకోట్టై బస్‌స్టేషన్‌ నుంచి బ యలుదేరిన ప్రభుత్వ బస్సులో విధి నిర్వహణలో భాగంగా మంగళవారం తంజావూరు వైపు వస్తున్నాడు. బస్సును డ్రైవర్‌ మణికంఠన్‌ నడిపాడు. ఈ బస్సును ఓ ప్రైవేట్‌ బస్సు అనుసరించింది. బస్సు ను తంజావూరు పక్కనే ఉన్న గణపతి నగర్‌కు చెందిన మణికంఠన్‌(29) నడుపుతున్నాడు. తిరువా రూరు జిల్లా కొరడచేరికి చెందిన శశికుమార్‌ (39) కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆ సమయంలో పాపనాడు బస్టాండ్‌లో ప్రభుత్వ బస్సులు, ప్రైవేట్‌ బ స్సు సిబ్బంది ప్రయాణికులను ఎక్కించుకునేందు కు పోటీ పడ్డారు. ఈ పోటీలో ప్రభుత్వ బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ ప్రభుత్వ బస్సును అడ్డుకుని డ్రైవర్‌ను దుర్భాషలాడారు. దీంతో రోడ్డుపై వెళుతు న్న ప్రైవేట్‌ బస్సును ఓవర్‌ టేక్‌ చేసేందుకు స్థలం ఇవ్వకుండా ప్రభుత్వ బస్సును డ్రైవర్‌ నడిపాడు. దీంతో ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో తంజావూరులోని తొల్కాప్పియ చౌరస్తాలో ప్రయాణికులను దించేందుకు ప్రభుత్వ బస్సు ఆగింది. ఆ సమయంలో ప్రైవేటు బస్సు డ్రైవర్‌, కండెక్టర్‌ కలిసి ప్రభుత్వ బస్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. ఇది చూసిన ప్రభుత్వ బస్సు కండక్టర్‌ మారియప్పన్‌ వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రైవేట్‌ బస్సు కార్మికుల ఆగ్రహం మారియప్పన్‌పైకి మళ్లింది. మణికంఠన్‌, శశికుమార్‌ ఇద్దరూ మారియప్పన్‌ ను దూషించడంతోపాటు అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో ఆ ప్రాంత ప్రజలు అక్కడికి చేరుకుని ప్రభుత్వ బస్సు కండక్టర్‌ను ప్రైవేటు బస్సు కార్మికుల నుంచి కాపాడారు. ఈ దాడిలో మారియప్పన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమాచారం మేరకు తంజావూరు ఈస్ట్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన మారియప్పను చికిత్స నిమిత్తం తంజావూరు మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. మారియప్పన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ మణికంఠ, కండక్టర్‌ శశికుమార్‌ కోసం గాలిస్తున్నారు. తంజావూరులో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

Advertisement
Advertisement