IT Raids Continues In BRS Leaders Houses In Hyderabad - Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నేతలపై ఐటీ దాడులు.. ఎల్బీనగర్‌లో 23 ఎకరాల ప్రాజెక్ట్‌ విషయంలో..

Published Fri, Jun 16 2023 4:42 PM

IT Raids Continue On Houses Of BRS Leaders In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేతల నివాసాల్లో మూడో రోజు కూడా ఐటీ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్‌ రెడ్డి, పైళ్ల శేఖర్‌ రెడ్డి సహా లైఫ్‌స్టైల్‌ మధుసూదన్‌ రెడ్డి నివాసంలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. 

కాగా, ఐటీ శాఖ అధికారులు మధుసూదన్‌ రెడ్డి భార్య, కుమారుడిని ప్రశ్నిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ భాగస్వామ్యం, వ్యాపార లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలతో మధుసూదన్‌రెడ్డి లావాదేవీలపైనా విచారణ చేస్తున్నారు. ఎల్బీనగర్‌లో 23 ఎకరాల ప్రాజెక్ట్‌ విషయంలో భారీగా నగదు చేతులు మారినట్టు ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్ట్‌ చేపట్టిన సంస్థతో ఒప్పందాలపై దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నేతల రియల్‌ ఎస్టేట్‌ సిండికేట్‌పైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

ఇక, గురువారం కూడా వారి కంపెనీల లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఆరా తీశారు. కంపెనీల ఆదాయం, ఐటీ రిటర్న్స్‌ వ్యత్యాసాలపై పత్రాలను పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్స్‌ వివరాలను అధికారులు సేకరించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఐటీ సోదాలు ముగిసిన అనంతరం అధికారులు.. గురువారం రోజున ఎంపీ ప్రభాకర్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: దేశానికి హైదరాబాద్‌ రెండో​ రాజధాని కావాలి: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

Advertisement

తప్పక చదవండి

Advertisement