పాలపుంతలో గురుత్వాకర్షణ తరంగాల గుట్టు | Sakshi
Sakshi News home page

పాలపుంతలో గురుత్వాకర్షణ తరంగాల గుట్టు

Published Thu, Jul 6 2023 4:09 AM

Research to solve astronomical mysteries - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖగోళ రహస్యాలను తేల్చే పరిశోధనలో భాగంగా.. పాలపుంతలో గురు­త్వా­కర్షణ తరంగాల ఆధారాలను కను­గొన్న బృందంలో హైదరాబాద్‌ ఐఐటీ పరిశో­దకులూ భాగస్వాము­ల­య్యారు. ‘ఇండియన్‌ పల్సర్‌ టైమింగ్‌ అర్రే (ఐఎన్‌పీటీఏ)’­తోపాటు జపాన్, యూరప్‌ దేశాల అంతరిక్ష శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారని ఐఐటీ హైదరాబాద్‌ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ప్రపంచంలోని ఆరు అత్యాధునిక రేడియో టెలిస్కోప్‌లను ఉపయోగించి ఖగోళాన్ని పరిశీలించామని.. పాలపుంతలో అతి తక్కువ పౌనఃపున్యం ఉన్న గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నా­మని తెలి­పింది. ఈ వివరాలు ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయని పేర్కొంది.

ఐఐటీ హైదరాబాద్‌ భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ శంతన్‌దేశాయ్, అమన్‌ శ్రీవాత్సవ, ఫిజిక్స్‌ పీహెచ్‌డీ విద్యార్థి దివ్య­నాశ్‌ కర్బందా, బీటెక్‌ విద్యార్థులు శ్వేత అర్ముగం, ప్రజ్ఞ మాండిపాక తదితరులు పరిశోధన బృందంలో ఉన్నారని వివరించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement