ఆటో, ఐటీకి కేరాఫ్‌గా తెలంగాణ | Sakshi
Sakshi News home page

ఆటో, ఐటీకి కేరాఫ్‌గా తెలంగాణ

Published Thu, Jul 6 2023 3:53 AM

Telangana as carafe for auto and IT - Sakshi

హఫీజ్‌పేట్‌ (హైదరాబాద్‌): దేశంలో ఆటో, ఐటీకి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్‌గా మారిందని.. రాష్ట్రంలో ఆటోమోటివ్, మొబిలిటీ పరిశ్రమను మరింత బలోపేతం చేస్తామని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఉత్తమ మానవ వనరులు, నైపుణ్యానికి హైదరాబాద్‌ నగరం ఎంతో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.

బుధవారం ఆయన హైదరాబాద్‌లో పలు సంస్థల కార్యాలయా లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు. ప్రపంచంలోని ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటిగా, మొబిలిటీ ప్రొవైడర్‌గా గుర్తింపు పొందిన స్టెల్లాంటిస్‌ డిజిటల్‌ హబ్‌ కార్యాలయాన్ని హైదరా బాద్‌లో ప్రారంభించడం ఒక మైలురాయి అని కేటీఆర్‌ పేర్కొన్నారు. సుస్థిర మొబిలి టీకి మాత్రమే భవిష్యత్తు ఉందని చెప్పారు.

మొబిలిటీలో తొలి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇక్కడే..
మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీ–హబ్‌ ప్రాంగణంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, హ్యుందాయ్‌ మొబిన్‌ ఇన్, బిట్స్‌ హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వ్యూహాత్మక సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరింది.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మొబిలిటీ రంగంలో దేశంలోనే తొలి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు హైదరాబాద్‌ కేంద్రంగా మారనుందని చెప్పారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో కోర్సుల రూపకల్పన, పరిశోధన, అభివృద్ధి, విద్యార్థులకు శిక్షణలో ఈ భాగస్వామ్యం ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు.

రిసోర్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా హైదరాబాద్‌
నానక్‌రాంగూడలో రైట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ కొత్త డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఐటీ రంగంలో హైదరాబాద్‌ ఎంతో ప్రగతి సాధించిందని.. రిసోర్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా మారిందని చెప్పారు. 2014లో 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. ఇప్పుడు 9.05 లక్షల మందికి చేరారని, ఐటీ ఎగుమతులు రూ.2.41 లక్షలకు పెరిగాయని వివరించారు. 

Advertisement
Advertisement