ఫలించిన నిరీక్షణ  | Sakshi
Sakshi News home page

ఫలించిన నిరీక్షణ 

Published Thu, Feb 22 2024 4:49 AM

18 years of waiting has come to fruition - Sakshi

సిరిసిల్ల: 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. దుబాయ్‌ జైల్లో బందీలుగా ఉన్న ఇద్దరు విడుదలై ఇల్లు చేరా రు. చాలాకాలానికి ఇల్లు చేరిన వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. 2005 లో దుబాయ్‌ వెళ్లిన వలసజీవులు.. అక్కడ హత్య కేసులో ఇరు క్కుని 18 ఏళ్లపాటు శిక్ష అనుభవించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల శివారులోని పెద్దూరు ఒడ్డెరకాలనీకి చెందిన శివరాత్రి మల్లేశం(48), శివరాత్రి రవి (45) బుధవారం ఇంటికి వచ్చారు. వీరు దుబాయ్‌లో కల్లీవెల్లి వీసా(కంపెనీ వీసా కాదు)పై పనిచేశారు.

2006లో దుబాయ్‌లో నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు హత్య కేసులో నలుగురు పాకిస్తానీయులు, ఆరుగురు తెలంగాణవాసులకు అక్కడి కోర్టు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయు లు, కరీంనగర్‌ జిల్లాకు చెందిన సయ్యద్‌ కరీం ఇప్పటికే విడుదలయ్యారు. సిరిసిల్లకు చెందిన మల్లేశం, రవి, కోనరావుపేటకు చెందిన లక్ష్మణ్, జగిత్యాల జిల్లాకు చెందిన శివరాత్రి హన్మంతు, చందుర్తి మండలం మల్యాలకు చెందిన నాంపల్లి వెంకటి జైలు శిక్షను పొడిగించడంతో బందీలుగా ఉన్నారు.

వీరిలో లక్ష్మణ్, హన్మంతు ఇటీవల విడుదలకాగా.. తాజాగా మల్లేశం, రవి విడుదలయ్యారు. వెంకటి మరో నెల రోజుల్లో విడుదల కానున్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌ వీరి విడుదల కోసం ఎంతో కృషిచేశారు. మ ల్లేశం, రవికి విమాన టికెట్లు, హైదరాబాద్‌ నుంచి పెద్దూ రు చేరేందుకు వాహనాన్ని కేటీఆర్‌ ఏర్పాటు చేశారు. మల్లేశం, రవి కుటుంబ సభ్యులతో అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లా డారు. బాధితుల కుటుంబ సభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement