ఘోర రోడ్డు ప్రమాదం; ఇద్దరి మృతి

28 Jun, 2021 08:35 IST|Sakshi

సాక్షి, వనపర్తి(మహబూబ్‌ నగర్‌): వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి 44 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తుండగా సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఘటన స్థలంలోనే చనిపోయారు.

మృతులు అనంతపురం జిల్లా గుత్తి మండలానికి చెందిన బంగారు వ్యాపారి ఆనంద్‌ కుమార్‌, పామిడికి చెందిన డ్రైవర్‌ నూర్‌ అహ్మద్‌గా గుర్తించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

చదవండి: ఆదిలాబాద్‌లో విషాదం: అనారోగ్యంతో ఆర్మీ జవాన్‌ మృతి 

మరిన్ని వార్తలు