ఆర్టీసీ ఉద్యోగులకు 21శాతం ఫిట్‌మెంట్‌ | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగులకు 21శాతం ఫిట్‌మెంట్‌

Published Sun, Mar 10 2024 1:44 AM

21 percent fitment for RTC employees - Sakshi

జూన్‌ 1న ఇచ్చే మేనెల జీతంతో చెల్లింపు

ఏడేళ్ల బకాయిలు మాత్రం పదవీ విరమణ సమయంలో

వడ్డీ లేకుండా ఆ బకాయిలు చెల్లింపు

తాజాగా ప్రకటించిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చే యాల్సిన రెండు వేతన సవరణ బకాయిల్లో ఒకదా న్ని ప్రభుత్వం క్లియర్‌ చేసింది. 2017లో జరగాల్సిన వేతన సవరణకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ కాకుండా మధ్యంతర భృతితో సరిపెట్టింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 21 శా తం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది.

జూన్‌ ఒకటో తేదీ న అందుకోబోయే మే నెల వేతనంతో దీని చెల్లింపు ప్రారంభం కానుంది. ఈ ఏడేళ్లకు సంబంధించిన బ కాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లించను న్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీ లేకుండా బకా యిలను మాత్రమే చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది.

ఇలా పేరుకుపోయి: రాష్ట్ర విభజనకు ముందు 2013లో వేతన సవరణ జరగాల్సి ఉండగా, నాటి విభజన హడావుడిలో ఉమ్మడి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 లో నాటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అప్పట్లో నాటి సీఎం కేసీఆర్‌ ఏకంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ లో ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉంటుంది. 2013 వేతన సవరణ తర్వాత 2017లో, మళ్లీ 2021లో జరగాల్సి ఉంది. ఈ రెండూ అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి.

2017 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు 2018లో సమ్మె నోటీసు ఇచ్చాయి. అప్ప టి ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్న ఉద్దేశంతో ప్రభు త్వం దాన్ని అమలు చేయలేదు. కార్మిక సంఘాలతో చర్చించేందుకు నాటి మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. పలు దఫాల చ ర్చల అనంతరం 16 శాతం మధ్యంతర భృతిని కమిటీ ప్రకటించింది.

2018 జూన్‌ నుంచి అది కొనసాగుతోంది. ఈలోపు 20 21లో మరో వేతన సవరణ గడువు దాటి పోయింది. గత కొన్ని రోజులుగా కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు బకాయిల చెల్లింపుపై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. త్వరలో పార్ల మెంటు ఎన్నికలు కూడా ఉండటంతో ప్రభుత్వం, ఒక వేతన సవరణను అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ శనివారం బస్‌భవన్‌లో ప్రకటించారు.

ఎంత పెరుగుతుందంటే..: గత ఆరేళ్లుగా 16 శాతం ఐఆర్‌ను లెక్కగడుతూ ఆర్టీసీ చెల్లిస్తోంది. ఇప్పుడు దాన్ని తొలగించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను లెక్కగట్టి చెల్లిస్తారు. ఉద్యోగుల మూల వేతనంపై మాత్రమే ఐఆర్‌ను లెక్కిస్తారు. దీంతో ఆ పెరుగుదల తక్కువ గా ఉంటుంది.

ఫిట్‌మెంట్‌ను మూలవేతనంతో పా టు కరువు భత్యం, ఇంక్రిమెంట్లపై లెక్కిస్తారు. దీంతో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీపై రూ.418.11కోట్ల భారం పడనుందని అంచనా. కాగా, ఆర్టీసీ ఉద్యో గుల్లో 41.47 శాతం మంది కండక్టర్లు, 35.20 శాతం మంది డ్రైవర్లు, 5 శాతం మంది మెకానిక్‌లు, 3.34 శాతం మంది శ్రామిక్‌లున్నారు. వీరి వేతనాల్లో పెరుగుదల ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం.

స్వాగతిస్తున్నాం: టీఎంయూ 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికులకు సంబంధించిన పే స్కేలు, బాండ్స్‌ డబ్బులు ఇచ్ఛిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌కు శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. 

గొప్ప నిర్ణయం: ఎన్‌ఎంయూ 
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ చేయడం గొప్ప నిర్ణయమని టీఎస్‌ఆర్టీసీ ఎన్‌ఎంయూ అధ్యక్షుడు పి.కమల్‌రెడ్డి, నరేందర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా పీఎఫ్‌ వెంటనే చెల్లించాలని, డీఏ బకాయిల సమస్యను పరిష్కరించాలని కోరారు.  

‘30 శాతం అనుకుంటే.. 21 శాతమే ఇచ్చారు’ 
వేతన సవరణ 30 శాతం చేస్తుందనుకుంటే 21శాతంతో సరిపెట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆర్టీసీ బహుజన వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణగౌడ్, సుద్దాల సురేశ్‌ ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు.  

Advertisement
Advertisement