వైద్యుల నిర్వాకం.. బాలికకు తెలియకుండా అబార్షన్‌.. ఆ తర్వాత..

12 May, 2022 17:49 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఆసుపత్రికి చెందిన వైద్యులు పెళ్లికాని బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి అబార్షన్‌ చేయడం కలకలం సృష్టించింది. 

వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలో రామరక్ష ఆసుపత్రి వైద్యులు బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి అబార్షన్‌ చేశారు. విషయం తెలుసుకున్న యువతి తల్లి వైద్యాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో అధికారులు ఆసుపత్రికి వచ్చి విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో రికార్డులను అధికారులు  స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి నుంచి ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సేవలు అందించరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. 

ఇక, ఈ ఘటనలో రంగంలోకి దిగిన పోలీసులు 417, 420, 312, 342, 376, పొక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఎంత మందికి అబార్షన్‌ చేశారు. ఎప్పుడు ఏ సమయంలో అబార్షన్స్‌ చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: మహిళతో న్యూడ్‌ కాల్స్‌.. వాటిని రికార్డ్స్‌ చేసి!

మరిన్ని వార్తలు