ఇకపై ఎంసెట్‌..  టీఎస్‌ఈఏపీసెట్‌  | Sakshi
Sakshi News home page

ఇకపై ఎంసెట్‌..  టీఎస్‌ఈఏపీసెట్‌ 

Published Fri, Jan 26 2024 4:36 AM

Announcement of Dates of 8 Sets of Tests - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ఈఏపీసెట్‌), టీఎస్‌ ఈ సెట్, టీఎస్‌ ఎడ్‌సెట్‌ సహా మొత్తం ఎనిమిది ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను ప్రకటించింది. రాబోయే 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించిన వివిధ కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం నిర్వహించే పరీక్షల తేదీలు, వాటిని నిర్వహించే విశ్వవిద్యాలయాల వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో గతంలో టీఎస్‌ ఎంసెట్‌గా ఉన్న పేరును గత కొంతకాలంగా విడిగా నీట్‌ ద్వారా మెడిసిన్‌ ప్రవేశాలను నిర్వహిస్తుండడంతో  టీఎస్‌ఈఏపీసెట్‌గా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది.

గురువారం ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, టీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌ ప్రొ. ఆర్, లింబాద్రి షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో... టీఎస్‌సీహెచ్‌ఈ వైస్‌ చైర్మన్‌ ప్రొ. ఎస్కే మహమూద్, జేఎన్‌టీయూ–హెచ్‌ వీసీ ప్రొ. కట్టా నర్సింహారెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.డి.రవీందర్, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.టి.రమేశ్‌ పాల్గొన్నారు.

ఈ ప్రవేశపరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ..షెడ్యూల్, దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్‌ పీజు తదితరాల గురించి సంబంధించి సెట్‌ కన్వీనర్లు ప్రకటిస్తారని ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. 

ఈ ఎనిమిది ప్రవేశపరీక్షలకు సంబంధించిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లు) టీఎస్‌ సెట్‌ల తేదీలు, నిర్వహించే యూనివర్సిటీల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.... 

Advertisement
Advertisement