కవితపై వ్యాఖ్యల ఎఫెక్ట్‌: మహిళా కమిషన్‌ నోటీసులకు బండి సంజయ్‌ రిప్లై

14 Mar, 2023 15:06 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కి బీజేపీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ లేఖ రాశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఆయన.. ఇవాళ లేఖ ద్వారా స్పందించారు. 

మెయిల్‌ ద్వారా తనకు నోటీసులు అందాయని తెలిపిన బండి సంజయ్‌.. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో 15వ తేదీ కమిషన్‌ ఎదుట హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. అయితే.. బదులుగా ఈ నెల 18వ తేదీన కమిషన్ ఛైర్మన్  సూచించిన టైంకి హాజరుకాగలనని చెప్పారు.

అలాగే తాను కమిషన్‌ ఎదుట హాజరయ్యే అంశంపై పూర్తి సమాచారం అందించగలిగితే.. తాను విచారణ సమయానికి పూర్తి స్థాయి సన్నద్ధతో ఉంటానని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు