టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌లీక్‌పై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

18 Mar, 2023 10:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ను బీజేపీ నేతల బృందం కలిసింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌పై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, సీహెచ్‌ విట్టల్‌, మర్రి శశిధర్‌ రెడ్డి, రామచందర్‌ రావు తదితరులు ఫిర్యాదు చేశారు.  5 డిమాండ్లతో గవర్నర్‌కు బీజేపీ వినతి పత్రం అందజేశారు.

టీఎస్‌పీఎస్‌సీ కొత్త కమిషన్‌ వేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, పేపర్‌ లీకేజ్‌ వల్ల నష్టపోయిన అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌ తమ పదవులకు రాజీనామా చేయాలని మండిపడ్డారు.
చదవండి: జీవితంలో స్థిరపడేలోపే... నిండు ప్రాణాల్ని మింగేసిన అగ్గి

మరిన్ని వార్తలు