కేసీఆర్‌.. టైమ్‌పాస్‌ రాజకీయాలు చేసింది చాలు: బండి సంజయ్‌

11 Jun, 2022 16:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అన్నట్టుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేసీఆర్‌.. కేంద్రంపై పోరుకు సిద్దమవుతుండగా.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ‍్యలు చేశారు. 

తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి కేసీఆర్‌ సర్కార్‌పై మండిపడ్డారు. బండి సంజయ్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘‘కేసీఆర్ టైమ్‌పాస్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు అని వ్యాఖ్యలు చేసిన సంజయ్.. ముందు తెలంగాణకు ఏం చేశారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఈ క‍్రమంలోనే మోదీ ఎనిమిదేళ్ల పాలనపై.. అదే సమయంలో కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా..? అంటూ బండి సవాల్‌ విసిరారు. వారసత్వ, అవినీతి పార్టీలు దేశంలో అంతమైపోతున్నాయని అన్నారు. తెలంగాణను కులాలు, మతాలు, వర్గాల పేరుతో కేసీఆర్ విచ్ఛిన్నం చేశారని సంజయ్ ఆరోపించారు. ప్రపంచంలో భారత్‌ను మోడీ అగ్రస్థానంలో నిలిపారని చెప్పారు. కానీ, కేసీఆర్‌ మాత్రం ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. 

ఇది కూడా చదవండి: గవర్నర్‌ పిలిస్తే సీఎస్, డీజీపీలే వెళ్లరు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు