Hyderabad: కంటోన్మెంట్‌లో కారు చిచ్చు! | Sakshi
Sakshi News home page

Hyderabad: కంటోన్మెంట్‌లో కారు చిచ్చు!

Published Sun, May 7 2023 8:35 AM

BRS Leaders Internal Fight In Cantonment - Sakshi

హైదరాబాద్: తామంతా ఒక్కటేనంటూ చెప్పుకుంటున్న కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు ఎట్టకేలకు బహిర్గతమయ్యాయి. ఆత్మీయ సమ్మేళనాల సాక్షిగా నేతల మధ్య ఆధిపత్య పోరు తేటతెల్లం అవుతోంది. దివంగత ఎమ్మెల్యే సాయన్న వారసులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదంటూ కొన్ని రోజులు బాహటంగానే విమర్శలు చేస్తున్న సాయన్న వారసులు ఏకంగా తిరుగుబావుటా ఎగరవేశారు. 

ఆతీ్మయ సమ్మేళనాల ఇన్‌చార్జ్‌ దాసోజు శ్రవణ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టేశారు. తమ నివాసానికి కూతవేటు దూరంలోనే నిర్వహించిన ఐదో వార్డు ఆతీ్మయ సమ్మేళనానికి రాకుండా అదే సమయంలో నాలుగో వార్డులో పర్యటించడం ద్వారా తమ అసంతృప్తిని వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. గత నెలలో బోయిన్‌పల్లి మల్లారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించిన ఒకటో వార్డు ఆతీ్మయ సమ్మేళనానికి సైతం సాయన్న వారసులు లాస్య నందిత, నివేదిత గైర్హాజరయ్యారు. మంత్రులు తలసాని, మల్లారెడ్డి పాల్గొన్న సమావేశానికి సైతం రాకపోవడంతో అప్పట్లోనే చర్చనీయాంశమైంది. తాజాగా సాయన్న వారసులతో పాటు వారి వర్గానికి చెందిన మెజారిటీ నేతలు రాకపోవడం గమనార్హం. 

అలకకు కారణాలేంటో? 
దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణించిన మరునాడే అంత్యక్రియల విషయంలో ఆయన వర్గీయులు అధిష్ఠానంపై సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక సాయన్న దశదిన కర్మ ముగిసిన మరునాటి నుంచే మంత్రి తలసాని, మర్రి రాజశేఖర్‌ రెడ్డిల నడుమ ఆధిపత్య పోరుతో సాయన్న వారసులకు ఆదరణ లేకుండా పోయింది.  ఈ క్రమంలో మర్రి రాజశేఖర్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో అసమ్మతి మరింత పెరుగుతూ వచి్చంది. అందరినీ కలుపుకోవడమే తన లక్ష్యమంటూ ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న కార్పొరేషన్‌ చైర్మన్లు మన్నె క్రిశాంక్, గజ్జెల నాగేశ్,  ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి బీఆర్‌ఎస్‌లో చేరిన శ్రీగణేశ్‌ తదితరులందరినీ ఒకే వేదిక మీద కూర్చునేలా చేస్తూ ఆతీ్మయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో తమ తండ్రి సాయన్న పేరును తగ్గించే కుట్రకు తెరలేపారంటూ సాయన్న వారసులు అలక వహిస్తూ వచ్చారు.

 అదే సమయంలో తమకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారంటూ మర్రి రాజశేఖర్‌ రెడ్డిని నేరుగా నిలదీసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సాయన్న హయాంలో నిరి్మంచిన మడ్‌ఫోర్ట్, మారేడుపల్లి డబుల్‌ ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అధిష్ఠానం పెద్దలు కొందరు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లిన సాయన్న అక్కడే తొలిసారిగా గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరి రెండ్రోజుల చికిత్స అనంతరం మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన ఆఖరి కోరికను నెరవేర్చే విషయంలోనూ తమకు సహకారం అందడం లేదని సాయన్న వారసులు ఆవేదనతో ఉన్నారని, ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే.. తాము వ్యక్తిగత పనుల వల్లే సమావేశానికి రాలేకపోయామంటూ లాస్య, నివేదిత పేర్కొనడం కొసమెరుపు 

ఎర్రోళ్ల సైతం..  
ఇక నియోజకవర్గం పరిధిలోనే ఐదో వార్డులో నివాసముండే సమయంలోనే డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విద్యార్ధి విభాగం నేతగా, టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరోలోనూ స్థానం దక్కించుకున్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం టీఎస్‌–ఎంఎస్‌ఐ డీసీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తాను సొంతంగా భావించే ఐదో వార్డు ఆత్మీయ సమావేశానికి తనకే ఆ హ్వానం లేదంటూ ఆయన డుమ్మా కొట్టడం విశేషం.  

Advertisement
Advertisement