సీఎం కేసీఆర్‌తో ఎలాంటి విభేదాల్లేవు | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌తో ఎలాంటి విభేదాల్లేవు

Published Sat, Feb 19 2022 3:32 AM

Chinna Jeeyar Swamy Reaction On Differences With CM KCR - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘సీఎం కేసీఆర్‌తో మాకు ఎలాంటి విభేదాల్లేవు. సహస్రాబ్ది సమారోహంలో నిరంతరాయ విద్యుత్, మంచినీటి సరఫరా, పోలీసు భద్రత, ఇతర ఏర్పాట్లన్నీ ఆయన సహకా రం వల్లే అందాయి. ఆయనతో విభేదాలు అన్న పదమే కరెక్ట్‌ కాదు’ అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌స్వామి స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల వల్లే ఆయన సమతామూర్తి సందర్శనకు రాలేక పోయారన్నారు. శుక్రవారం ముచ్చింతల్‌ శ్రీరామ నగరంలో మీడియాతో చినజీయర్‌ మాట్లాడారు.

సమారోహానికి రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు. రాజకీయాల్లో మాత్రమే స్వపక్షం, విపక్షం అనేవి ఉంటాయని, భగవంతుని సన్నిధిలో అలాంటి వాటికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పారు. రామానుజాచార్యుల సహ స్రాబ్ది సమారోహానికి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతోపాటు సాధారణ భక్తులందరినీ ఆహ్వానించామని చెప్పారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ప్రధాని చేతుల మీదుగా చేయిం చాలని 2016లోనే కమిటీ తీర్మానించిందని, ఆ విషయం సీఎం కేసీఆర్‌ సహా ప్రముఖులందరికీ తెలుసని ఓ ప్రశ్నకు సమా దానంగా చెప్పారు. కేసీఆర్‌తో కానీ, ఇతర నేతలతో కానీ తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కార్య క్రమానికి తొలి వలంటీర్‌గా తానే వ్యవహరిస్తానని స్వయంగా కేసీఆరే చెప్పారని గుర్తు చేశారు.

108 మూర్తులకు ఒకేసారి...
108 దివ్యదేశాల్లోని మూర్తులకు శనివారం శాంతి కల్యాణం నిర్వహించనున్నట్లు చినజీయర్‌ చెప్పారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. ‘రామానుజా చార్యుల దర్శనానికి వెళ్లే సోపాన మార్గంలో 14 మెట్లపై 108 దివ్యదేశాల్లోని మూర్తు లకు శాంతి కళ్యాణం నిర్వహిస్తాం. ఒక్కో మెట్టుపై 7 నుంచి 9 పెరుమాళ్లకు కల్యాణం జరుపుతాం. ఇప్పటివరకు ఒక్కో ఆలయంలో ఒకరు లేదా ఇద్దరు మూర్తులకు మాత్రమే కల్యాణం నిర్వహించ డం చూశాం. కానీ చరిత్రలోనే తొలిసారిగా ఇక్కడి పెరుమాళ్లందరికీ ఒకే సమయంలో.. ఒకే వేదికపై కల్యాణం నిర్వ హిస్తుండటం చాలా అరుదైన అంశం. ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని స్వయంగా వీక్షించే అవకాశాన్ని ప్రతి ఒక్కరికీ కల్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 

కరోనా తగ్గింది.. అదే అద్భుతం
‘ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న రెండు రకాల వైరస్‌లలో ఒకటి కరోనా కాగా, రెండోది అసమాన తలు, విభేదాలు. 12 రోజులపాటు ఐదు వేల మంది రుత్వికులతో యజ్ఞాలు, పూజలు చేయించ డం వల్ల ప్రజలకు మంచే జరిగింది. ప్రస్తుతం కరోనా తగ్గిపోయింది. ఇదంతా యాగ ఫలమే. కార్యక్రమం ప్రారంభానికి ముందు రోజుకు 25 వేల కరోనా కేసులు నమోదైతే.. ఆ తర్వాత రెండో రోజే వాటి సంఖ్య రెండు వేలకు పడిపోయింది. ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయింది. ఇదంతా హోమ పూజా ఫలితమే’ అని చినజీయర్‌ స్పష్టం చేశారు. సమతావాదం, సామ్యవాదం అనేది పాశ్చాత్యుల నుంచి వచ్చినట్లు అంతా భావిస్తున్నారని, నిజానికి వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు ఈ సమానత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.

రేపటి నుంచి సువర్ణమూర్తి దర్శనం
►ఈ నెల 20 నుంచి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రామాను జుల 120 కేజీల సువర్ణమూర్తిని దర్శించు కునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చినజీయర్‌ తెలిపారు. సమతామూర్తి సంద ర్శనకు వచ్చే భక్తులకు ఆలయ విశిష్టతలను వివరించేందుకు నియర్‌ ఫ్రీక్వెన్సీ కమ్యూ నికేషన్‌ (ఎన్‌ఆర్‌సీ) వ్యవస్థ ఏర్పాటు చేశా మని, ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని సువర్ణమూర్తి చుట్టూ ఉన్న స్తంభాల ముందు నిలబడి.. వాటిపై ఉన్న ఛాయాచిత్రాల ప్రాముఖ్య తను తెలుసుకోవచ్చన్నారు. డైనమిక్‌ ఫౌంటెయిన్, ఆగు మెంటెడ్‌ రియాల్టీ షో, త్రీడీ మ్యాపింగ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ సేవలన్నీ అందుబాటులోకి వచ్చాక నిర్వహణ భారాన్ని బట్టి, సేవలకు ధరలను నిర్ణయిస్తామన్నారు.  

Advertisement
Advertisement