HYD: CM KCR And NV Ramana At State Judicial Officers Conference In Gachibowli - Sakshi
Sakshi News home page

State Judicial Officers Conference: సీజేఐ ఎన్వీ రమణకు ధన్యవాదాలు: సీఎం కేసీఆర్‌

Published Fri, Apr 15 2022 10:34 AM

Cm Kcr And NV Ramana At State Judicial Officers Conference In Gachibowli - Sakshi

సాక్షి హైదరాబాద్‌:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చొరవతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ మేరకు సీజేఐ ఎన్వీ రమణకు కేసీఆర్‌ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గచ్చిబౌలిలో శుక్రవారం న్యాయాధికారుల సదస్సు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లోని జిల్లా న్యాయమూర్తులతో నిర్వహించిన ఈ సమావేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. సీజేఐ సూచనతో 850 అదనపు పోస్టులు మంజూరు చేశామని వెల్లడించారు. జిల్లా కోర్టులకు 1730 అదనపు పోస్టులు మంజూరు చేశామన్నారు. హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్రానికి లేఖ రాశామని, హైకోర్టు బెంచీల సంఖ్య పెరిగింది కాబట్టి సిబ్బంది ఏర్పాటు చేయాలని సీజేఐ చెప్పారని తెలిపారు. కోర్టుల మీద ఉన్న అపారమైన గౌరవంతో రెవెన్యూ కోర్టులు రద్దుచేశామన్నారు.  

‘జిల్లా కోర్టు భవనాల నిర్మాణం కోసం స్థలాల ఎంపిక జరుగుతోంది. హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ క్వార్టర్స్‌ నిర్మిస్తాం. 42 మంది న్యాయమూర్తులకు ఒకేచోట క్వార్టర్స్‌. క్వార్టర్స్‌ నిర్మాణం కోసం 30 ఎకరాల స్థలం సిద్ధంగా ఉంది. ఈ ఏడాదే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తాం.’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement