తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా బక్కి వెంకటయ్య

21 Sep, 2023 21:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్‌ను, సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్  ఛైర్మన్‌గా మెదక్‌కు చెందిన బక్కి వెంకటయ్య నియామకమయ్యారు.  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు.

సభ్యులుగా కుస్రం నీలాదేవి (ఆదిలాబాద్), రాంబాబు నాయక్ (దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ(కరీంనగర్), జిల్లా శంకర్ (నల్గొండ జిల్లా), రేణికుంట ప్రవీణ్ (ఆదిలాబాద్)ను నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.

మరిన్ని వార్తలు