మత చిచ్చు పెడుతున్నారు.. యువత భవిష్యత్తుకు ఇది ప్రమాదం: సీఎం కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

మత చిచ్చు పెడుతున్నారు.. యువత భవిష్యత్తుకు ఇది ప్రమాదం: సీఎం కేసీఆర్‌

Published Tue, Mar 15 2022 1:55 PM

CM KCR Comments About Budget On Telangana Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌ అంటే బ్రహ్మపదార్థం కాదని సీఎం కేసీఆర్‌ తెలిపారు.. బడ్జెట్‌ అంటే అంకెలు మాత్రమే చెబుతారన్న అపోహా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడ్జెట్‌ అద్భుతమని అధికారపక్షం అంటే, బాగాలేదని ప్రతిపక్షం విమర్శిస్తుందన్నారు. ఈ విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మ‌ని అన్నారు. బడ్జెట్‌ అనేది నిధుల కూర్పు అని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ తొలి బడ్జెట్‌ 190 కోట్లు అయితే అందులో 91 కోట్లు రక్షణకే కేటాయించినట్లు పేర్కొన్నారు.

అవినీతిని పూర్తిగా నిర్మిలించాం
ప్రభుత్వాలకు అప్పులు సహజమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఏపీ బడ్జెట్‌ రూ.680 కోట్లు ఉంటే ఇప్పుడేమో బడ్జెట్‌ లక్షల కోట్లకు చేరిందన్నారు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రెండే అధికారులు ఉంటాయన్న కేసీఆర్‌.. ఎవరికైనా ట్యాక్స్‌లు వేయొచ్చు, అరెస్ట్‌ చేయొచ్చని తెలిపారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రశంసించారు. రాష్ట్రంలో అవినీతిని పూర్తిగా నిర్మిలించామని చెప్పారు. అప్పులనేది వనరుల సమీకరణ కింద భావిస్తామని. వనరుల సమీకరణలోనూ కఠోరమైన క్రమశిక్షణ పాటిస్తున్నామని తెలిపారు. అప్పులుచేసే రాష్ట్రాల్లో మన ర్యాంకు 28గా ఉందనిని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

అందుకే భట్టిని పార్లమెంట్‌కు పంపాలనుకుంటున్నా
సీఎం కేసీఆర్కేంద్రం విషయాలను ఇక్కడ సీఎల్పీ లీడర్‌ భట్టి విక్రమార్క గట్టిగా మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకే భట్టిని పార్లమెంట్‌కు పంపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇన్నాళ్లకు తమపై భట్టికి దయ కలిగిందని, మన ఊరు- మన బడి మంచిదని భట్టి చెప్పినట్లు తెలిపారు. భట్టికి ప్రమోషన్‌ ఇవ్వాలని  తెలిపారు. తన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్న భట్టి  ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: హైకోర్టు ఉత్తర్వు కాపీలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌ ఏమన్నారంటే..

‘మన అప్పులు శాతం కూడా 23 శాతమే. మనకంటే ఎక్కువ అప్పులుచేస్తున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అప్పులపై భట్టికి ఆందోళన అక్కర్లేదు.  రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం, రాష్ట్రాలను అణిచేస్తాం అనే దుర్మార్గ వైఖరితో కేంద్రం ఉంది. కేంద్రం పనితీరు మనకన్నా దారుణంగా ఉంది. ప్రస్తుతం భారతదేశం అలప్పు 152 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తోంది. దేశంలో ఫెడరలిజం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఐఎస్‌ఎస్‌ల విషయంలోనూ కేంద్రం కొత్త అధికారాల కోసం ప్రయత్నిస్తోంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పాం. 

మత చిచ్చు దేశానికి మంచిది కాదు
హైదరాబాద్‌ ఐటీ ఎగుమతుల విలువ ఏడాదికి దాదాపు లక్షన్నర కోట్లు. రాష్ట్రాల్లో పరిస్థితులు దిగజారితే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి. హిజాబ్‌ వంటి సమస్యలు ఉంటే పారిశ్రామిక వేత్తలు వస్తారా?  మత చిచ్చు దేశానికి మంచిది కాదు. దేశంలో మతోన్మాదం, మూకదాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి వివాదాలు మన దేశ యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయి. 25 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. ఎంబీబీఎస్‌ చదవుకోడానికి అక్కడికి వెళ్లారు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ ఖర్చు తక్కువ అని విద్యార్థులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ప్రభుత్వం చదివిస్తుంది.’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement