CM KCR Focus On Governor Quota MLC Posts Replacement, Details Inside - Sakshi
Sakshi News home page

గవర్నర్‌ కోటా చాన్స్‌ ఎవరికో..? 20 మంది ఆశావహులు.. ఆ ఇద్దరు ఎవరు?

Published Tue, Jul 11 2023 5:38 AM

CM KCR Focus On Governor quota mlc posts replacement - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుమారు నెలన్నరకు పైగా ఖా ళీగా ఉన్న రెండు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించిన ప్రక్రియపై బీఆర్‌ఎస్‌ అధి నేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేపట్టారు. అభ్యర్థులను ఖరారు చేసి ప్రతిపాదనలు పంపడంపై దృష్టి సారించారు. ఇద్దరి పేర్లను వారం రోజుల్లో నే గవర్నర్‌ ఆమోదానికి పంపే అవకాశ ముందని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మే 27న గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన ఫారూఖ్‌ హుస్సేన్, డి.రాజేశ్వర్‌ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. వీరి స్థానంలో ఎవరినీ నామినేట్‌ చేయకపోవడంతో సుమారు నెలన్నర రోజులుగా ఈ రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. 

భారీ సంఖ్యలో ఆశావహులు
మైనార్టీ వర్గానికి చెందిన ఫారూఖ్‌ హుస్సేన్, డి.రాజేశ్వర్‌ ఇద్దరూ తమకు మరోమారు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు క్రిస్టియన్‌ మై నారిటీ వర్గానికి చెందిన రాయిడిన్‌ రోచ్‌.. తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పలు సంఘాలు చేసిన తీర్మానాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకె ళ్తున్నారు. వీరితో సుమారు 20 మంది నేతలు ఎమ్మె ల్సీ పదవులను ఆశిస్తుండగా పలువురి పేర్లు ముఖ్య మంత్రి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, దాసోజు శ్రవణ్, పీ ఎల్‌ శ్రీనివాస్‌ తదితరుల పేర్లకు సంబంధించి వడ పోత జరుగుతున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నా యి. 40 మంది సభ్యులున్న శాసనమండలిలో ప్రస్తుతం గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను మినహాయిస్తే ఇప్పట్లో ఇతర కోటాల్లో ఖాళీలు ఏర్పడే అవకాశం లేదు.

సుమారు మూడొంతులకు పైగా మండలి సభ్యులు 2027 నుంచి 2029 మధ్యకాలంలో ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోను న్నారు. వచ్చే ఏడాది ఒక్క ఖాళీ కూడా ఏర్పడే అవ కాశం లేకపోగా, 2025లో మాత్రం కేవలం ఇద్దరు ఎమ్మెల్సీలు ఎంఎస్‌ ప్రభాకర్, టి.జీవన్‌రెడ్డి పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు గట్టి పోటీ నెలకొందని, ఈ కారణంగానే సీఎం కేసీఆర్‌ వీటి భర్తీ విషయంలో నెలన్నర రోజులుగా తాత్సారం చేస్తున్నట్లు చెబుతున్నారు. 

త్వరలో మండలికి కూచుకుళ్ల గుడ్‌బై!
బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి త్వరలో పార్టీని వీడేందుకు సిద్ధమవుతు న్నారు. కూచుకుళ్ల కుమారుడు నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తుండటం, సిట్టింగ్‌ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

కూచుకుళ్ల కుమారుడు ఇప్పటికే రాహుల్‌ సమ క్షంలో కాంగ్రెస్‌లో చేరగా, ఈనెల 20న కొల్లా పూర్‌లో జరిగే ప్రియాంకాగాంధీ సభలో ఆయ న కూడా చేరనున్నారు. ప్రస్తుతం అమెరికా నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో చర్చించి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని కూచుకుళ్ల భావిస్తున్నట్టు తెలిసింది. అదే జరిగితే ఎన్నికల కమిషన్‌ నిర్ణయం మేరకు ఈ ఏడాది చివర్లో కాని, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఈ ఖాళీ భర్తీకి ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement