బడ్జెట్‌ సమావేశాలు: ఈసారి 20 అంశాలతో నిలదీసేందుకు కాంగ్రెస్‌ సమాయత్తం | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ సమావేశాలు: ఈసారి 20 అంశాలతో నిలదీసేందుకు కాంగ్రెస్‌ సమాయత్తం

Published Sat, Feb 4 2023 3:22 AM

Congress Decided To Raise 20 Public Issues In Budget Sessions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో 20 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈనెల 6న రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం జరిగే చర్చలో భాగంగా ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. రైతులకు రుణమాఫీ అమలుతోపాటు ఉద్యోగులకు సంబంధించిన 317 జీవో, ప్రభుత్వాసుపత్రుల్లో బాలింతల మరణాలు, గురుకులాల్లో ఫుడ్‌ పాయిజనింగ్, ధరణి పోర్టల్‌ కారణంగా రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను లేవనెత్తాలని నిర్ణయించింది.

ఈ మేరకు శుక్రవారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పార్టీ పక్షాన 20 అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్‌ ఇవ్వకుండా చులకన చేస్తున్నారని ఈ సందర్భంగా భట్టి ప్రస్తావించినట్టు సమాచారం. దీనిపై అధికారులకు తగిన ఆదేశాలివ్వాలని స్పీకర్‌ను కోరినట్టు సీఎల్పీ వర్గాలు చెప్పాయి. 

కాంగ్రెస్‌ నిర్ణయించిన 20 అంశాలివే: 
►317 జీవో రద్దు రైతు రుణమాఫీ.. బ్యాంకురుణాలు, పంటలకు మద్దతు ధర
►రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు 
►మలక్‌పేట ప్రభుత్వాసుపత్రిలో బాలింతల మరణాలు 
►రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్‌ దందా, కిడ్నాప్‌లు  
►ఎస్సై, కానిస్టేబుల్‌ నియామకాల్లోని అవకతవకలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 
►గ్యాస్, పెట్రోల్, డీజిల్‌పై పన్నుల తగ్గింపు u  పోడు భూములపై గిరిజనులకు హక్కులు u సర్పంచ్‌ల సమస్యలు, గ్రామపంచాయతీల నిధుల దారి మళ్లింపు  
►కృష్ణా, గోదావరి నదుల్లో నీటి వాటా, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి, ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు u విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ విషయంలో ప్రొటోకాల్‌ పాటించకపోవడం u రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు, ఇతర రాష్ట్రాల కేడర్‌ అధికారులు తెలంగాణలో పనిచేయడం u డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు u గురుకులాల్లో ఫుడ్‌ పాయిజనింగ్‌ 
►పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు u రాష్ట్ర అప్పులు u కంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానం రద్దు, పాత పింఛన్‌ అమలు, పీఆర్సీ ప్రకటన u బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ 
►వైన్‌షాపులు, బెల్టుషాప్‌లు, బార్లు, పబ్బులతో సమస్యలు u ధరణి కారణంగా రైతుల ఆత్మహత్యలు   

Advertisement
Advertisement