కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక వాయిదా! | Sakshi
Sakshi News home page

Congress Party: అభ్యర్థుల ఎంపిక వాయిదా!

Published Wed, Sep 6 2023 8:18 PM

Congress party Candidate Election Postponed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వాయిదా పడింది. విధివిధానాలు, సర్వేలు, ఈక్వేషన్స్ ముందు పెట్టుకొని అభ్యర్థుల జాబితా సిద్ధం చెయ్యాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌లో నిర్వహించే సీడబ్ల్యూసీ సమావేశం తర్వాతే తేల్చాలని నిర్ణయం తీసుకుంది. 

ఈ క్రమంలో మరోసారి  స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉండనుంది. ఈసారి స్క్రీనింగ్‌ కమిటీ ఢిల్లీలో పెట్టాలని కెంగ్రెస్‌ భావిస్తోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల లిస్ట్ తయారు చేయనుంది. అభ్యర్థుల ఎంపికలో విధివిధానాలు, ఎలాంటి అంశాలు ప్రామాణికం చేసుకొని ఎంపిక చెయ్యాలో ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 

భారీగా దరఖాస్తులు
అభ్యర్థుల ఎంపిక కోసం ఆశావహుల నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాలకు కలిపి వెయ్యి మందికి పైగా అభ్యర్థులు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారందరినీ వడపోసి సరైన అభ్యర్థలను బరిలో నిలపాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం మీద ఉంది. 
చదవండి: ప్రధానికి లేఖ.. మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు?

తీవ్ర కసరత్తు
దరఖాస్తుల స్వీకరణ అనంతరం సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా కసరత్తు తీవ్రంగానే సాగుతోంది. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ అభిప్రాయాలతో పాటు, ఆపై పీఈసీలో లేని సభ్యులు, మాజీ కార్యదర్శులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతోనూ వన్‌ టు వన్‌ భేటీ నిర్వహించారు స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌. వాళ్ల నుంచి అభిప్రాయ సేకరణ ద్వారా చివరకు ఒక్కో నియోజకవర్గానికి ప్రయారిటీల వారిగా 1 నుంచి మూడు పేర్లను స్క్రీనింగ్‌ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 16,17 వ తేదీలలో హైదరాబాద్‌లో  సీడబ్ల్యూసీ సమావేశాలు ఉండడంతో  కేసి వేణుగోపాల్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. Cwc సమావేశాలు జరిగే తాజ్ కృష్ణ హోటల్ తో పాటు.. భారీ బహిరంగ సభ కోసం పీసీసీ చూసిన రెండు స్థలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం cwc సమావేశాల నేపథ్యంలో.. ఏఐసీసీ గైడ్ లైన్స్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం చేస్తారు. 

Advertisement
Advertisement