పార్కింగ్‌ అడ్డాగా సైక్లింగ్‌ ట్రాక్‌! | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌ అడ్డాగా సైక్లింగ్‌ ట్రాక్‌!

Published Thu, Jan 4 2024 1:12 PM

  cycle track still incomplete - Sakshi

హైదరాబాద్: నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజల కోసం రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్‌ ట్రాక్‌లను జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్మిస్తున్నారు. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా సైకిల్‌ ట్రాక్‌లను అభివృద్ధి చేసి నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికలకు ముందు హడావుడిగా పనులు చేపట్టారు. ఇదే క్రమంలో ఎల్‌బీనగర్‌ పరిధిలో చేపట్టిన సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణాన్ని కాంట్రాక్టర్‌ మధ్యలోనే నిలిపివేశాడు. అసంపూర్తిగా ఉన్న ఈ సైక్లింగ్‌ ట్రాక్‌ వాహనాల అక్రమ పార్కింగ్‌కు అడ్డాగా మారింది. ఉన్నతాధికారులు త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఈ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.  

► ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు ఇరువైపులా నాగోలు నుంచి ఎల్‌బీనగర్‌ వరకు సైకిల్‌ ట్రాక్‌ నిరి్మంచాలని నిర్ణయించిన అధికారులు 8 నెలల క్రితం పనులు ప్రారంభించారు. 
► రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను తొలగించి ఫుట్‌పాత్‌కు వాహనాలు వెళ్లే రోడ్డు మధ్య సుమారు పది అడుగుల వెడల్పులో ట్రాక్‌ నిర్మాణం మొదలు పెట్టారు.  నాగోలు నుంచి ఆదర్శనగర్‌ వరకు, ఎల్‌బీనగర్‌ శివగంగ కాలనీ దగ్గర కొంత మేరకు పనులు చేసిన కాంట్రాక్టర్‌ మధ్యలో ఆపేశాడు.  
► గత ప్రభుత్వంలో పనులు మొదలెట్టిన కాంట్రాక్టర్‌ ఇప్పడు చేయకపోవడంతో ఎక్కడిక్కడే నిలిచిపోయి. అర్ధంతరంగా పనులు నిలిపివేసి  ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    
► సైకిల్‌ ట్రాక్‌ పూర్తిగా ఉపయోగంలోకి రాక పోవడంతో కొంత మంది అక్కడ తమ వాహనాలను నిలుపుకుంటూ పార్కింగ్‌ స్ధలాలుగా ఉపయోగించుకుంటున్నారు.   
►జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ అధికారులు పట్టించుకోక పోవడంతో కోట్లది రూపాయలతో నిరి్మంచిన సైకిల్‌ ట్రాక్‌ అక్రమ పార్కింగ్‌కు అడ్డగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
► అధికారుల నిర్లక్ష్యం వల్ల అసలు ప్రారంభించకుండానే ట్రాక్‌ ధ్వంసమయ్యే ప్రమాదం ఉందంటున్నారు.  
► కాంట్రాక్టర్‌కు సకాంలో బిల్లులు రాకపోవడంతోనే పనులను పూర్తి చేయడం లేదని తెలుస్తోంది. 
► సైక్లింగ్‌ ట్రాక్‌ పనులను కాంట్రాక్టర్‌ 
► నిలిపి వేయడంతో ఈ పనులు అసలు పూర్తవుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  
► జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకొని సైక్లింగ్‌ ట్రాక్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. 

Advertisement
Advertisement