పర్యాటక రంగాభివృద్ధికి కృషి | Sakshi
Sakshi News home page

పర్యాటక రంగాభివృద్ధికి కృషి

Published Sat, Jul 15 2023 3:45 AM

Efforts for the development of the tourism sector - Sakshi

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నూతనంగా కొనుగోలు చేసిన రెండు ఏసీ బస్సులు, ఒక మినీ వాహనాన్ని శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గతంలో రెండు బస్సులను కొనుగోలు చేశామని, ప్రస్తుతం రూ.5 కోట్ల వ్యయంతో మరో రెండు బస్సులను కొనుగోలు చేసినట్లు వివరించారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతి, షిరిడీలకు భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు.

కాళేశ్వరం, నాగార్జునసాగర్, సోమశిల, ఆదిలాబాద్, వరంగల్‌ ప్రాంతాలలో 5 పాయింట్లుగా ఈ పర్యాటక బస్సులను నడిపేందుకు త్వరలో ప్రత్యేకమైన విధానాన్ని తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్‌ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, గీత కార్మికుల సహకార సంస్థ చైర్మన్‌ పల్లె రవికుమార్‌ గౌడ్, పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement