కరెంట్‌ కోతలపై అన్నదాతల నిరసన | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కోతలపై అన్నదాతల నిరసన

Published Mon, Feb 6 2023 1:51 AM

Farmers Protest In Front Of Substation For Power Cuts In Jagtial District - Sakshi

జగిత్యాల రూరల్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలోని రైతులు ఆదివారం స్థానిక సబ్‌ స్టేషన్‌ను ముట్టడించారు. వ్యవసాయ రంగానికి వచ్చే త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరాలో అంతరాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ ఉద్యోగులను కార్యాలయంలోని ఓ గదిలో ఉంచి తాళం వేశారు. సబ్‌స్టేషన్‌ ఎదుట సుమారు రెండు గంటలపాటు బైఠాయించారు.

వ్యవసాయ రంగానికి నిరంతరం త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కనీసం ఐదు గంటలు కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. సమయపాలన లేకుండా అధికారులు కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాత్రి, పగలు తేడాలేకుండా 24 గంటలపాటూ వ్యవసాయ బావుల వద్ద కరెంట్‌ కోసం పడిగాపులు కాస్తున్నామని పేర్కొన్నారు. కాగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. గది తాళం తీసి వారికి విముక్తి కల్పించారు.

Advertisement
Advertisement