రూ.2వేల నోట్ల మార్పిడి పేరిట మోసాలు.. | Sakshi
Sakshi News home page

రూ.2వేల నోట్ల మార్పిడి పేరిట మోసాలు..

Published Mon, May 29 2023 3:57 AM

Frauds in the name of exchange of Rs 2 thousand notes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రూ.2వేల నోట్లను మార్పిడి చేసి ఇస్తామని కొందరు మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు హెచ్చరిస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రూ.2వేల నోట్లను ఉపసంహరించడం తెలిసిందే. రూ.2వేల నోట్లను బ్యాంకులలో జమ చేసి ఇతర కరెన్సీ నోట్లు పొందాలని ఇప్పటికే సూచించింది. దీంతో కొన్ని రోజులుగా రూ.2వేల నోట్ల మార్పిడి పెరిగింది.

ఇదే అదనుగా రూ.2వేల నోట్లను కమీషన్లకు మార్చి ఇస్తామని మోసగిస్తున్న వారి వలలో పడవద్దని తెలంగాణ పోలీస్‌ శాఖకు చెందిన తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ప్రజల్లో ఈ తరహా మోసాలపై అవగాహన పెంచేందుకు ట్విట్టర్‌ ద్వారా పోలీస్‌ అధికారులు ప్రచారం చేస్తున్నారు.

రూ.2వేల నోట్ల మార్పిడి పేరిట మోసగించే వారిపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉంటే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. నోట్ల మార్పిడికి బ్యాంకులకే వెళ్లాలని, కొత్తవారిని నమ్మి మోసపోవద్దని వారు సూచించారు.  

Advertisement
Advertisement