క్షణాల్లో బంగారం సంచి మాయం! | Sakshi
Sakshi News home page

సంచి దొరికింది, మరి బంగారం?

Published Tue, Oct 13 2020 12:10 PM

Gold Bag Missing In Banjara Hills Police Arrested Salesman - Sakshi

సాక్షి, హైదరాబాద్: సేల్స్‌మన్‌ నిర్లక్ష్యం కారణంగా కిలోన్నర బంగారం మాయమైన సంచలన ఘటన బంజారాహిల్స్‌లో సోమవారం రాత్రి జరిగింది. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బషీర్‌బాగ్‌లోని వీఎస్ నగల దుకాణం నిర్వాహకులు జూబ్లీహి ల్స్ లోని కృష్ణ పెరల్స్ ఆభరణాల షాపులో ఓ కస్టమర్ కోసం ఆభరణాలు తీసుకొచ్చారు. వాటిని ప్రదీప్‌ అనే సేల్స్‌మన్‌ స్కూటీపై తిరిగి వీఎస్ నగల దూకాణానికి తీసుకెళుతున్న క్రమంలో బంగారం సంచి మిస్సయింది. బంజారాహిల్స్‌లో రోడ్డుపై వరదనీటిని దాటే క్రమంలో కాళ్ల మధ్యలో పెట్టుకున్న బంగారు నగల బ్యాగు కిందపడిపోయింది.

కొద్ది దూరం వెళ్లిన తర్వాత దీనిని గుర్తించిన ప్రదీప్ వెనక్కి వచ్చి చూడగా బ్యాగు కనిపించలేదు. వీఎస్ గోల్డ్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సేల్స్‌మన్‌ ప్రదీప్‌ను విచారిస్తున్నారు. సేల్స్‌మన్‌ ప్రదీప్ బ్యాగ్‌ పడిపోయిందని చెప్పిన చోట పోలీసులు వెతకగా.. ఆ వరద నీటిలో కొట్టుకుపోయిన బ్యాగు పక్క బిల్డింగ్‌లో ఉన్న చెత్త బుట్ట వద్ద దొరికింది. కానీ దాంట్లో బంగారు ఆభరణాలు మాత్రం లేవు. బంగారు ఆభరణాలు ఎవరు తీసుకెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: ‘మీ ఒక్కరోజు రాబడి..నాకు మూడునెలల ఆదాయం’)

Advertisement
Advertisement