Guru Purnima: భక్తులతో కిక్కిరిసిన సాయిబాబా ఆలయాలు

13 Jul, 2022 11:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచే భక్తులు సాయిబాబా ఆలయాలకు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబాకు అభిషేకాలు. అర్చనలు నిర్వహించారు. భజనలు చేశారు. హరతీ కార్యక్రమం నిర్వహించారు. స్వామికి ప్రత్యేకంగా దీపాలు వెలిగించారు. పల్లకీ సేవ నిర్వహించారు. పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోతున్న ఆలయాలు సాయినామస్మరణంతో మారుమ్రోగాయి.

పల్నాడు జిల్లా : అమరావతి శ్రీ బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాడ గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చారు.

విశాఖలో వైభవంగా గురు పౌర్ణమి పూజలు
 విశాఖ జిల్లాలో గురు పౌర్ణమి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. షిరిడి సాయి ఆలయాల్లో భక్తులు  ప్రత్యేక దర్శనాలు చేసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి షిరిడి సాయినాథునికి పవిత్ర జలాలతో అభిషేకాలు చేస్తున్నారు. 

వరంగల్ జిల్లా:
గురు పౌర్ణమి సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహించారు. 1500 కిలోలు వివిద రకాల పూలు పండ్లు కూరగాయలతో అమ్మవారి అలంకరించారు. శాకాంబరి అవతారంలో  భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు