హేమంత్‌ హత్య: సీపీ సజ్జనార్‌ని కలిసిన అవంతి

30 Sep, 2020 13:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో హేమంత్‌ కుమార్‌ హత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యను గచ్చిబౌలి పోలీసులు పరువు హత్యగా నిర్ధారించారు. తన భర్త హేమంత్‌ కుమార్‌ హత్యకు.. తన తండ్రి, మేనమామ కారణమని అవంతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హేమంత్‌ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని అవంతి బుధవారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిశారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని వినతి పత్రం అందించారు. హేమంత్‌ హత్యతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్‌ చేయాలని అవంతి ఈ సందర్భంగా సీపీని కోరారు.

పోలీసు కస్టడీకి నిందితులు:
ఈ హత్య కేసులో పోలీస్ కస్టడీకి తీసుకున్న ప్రధాన నిందితులు యుగంధర్రెడ్డి, లక్ష్మారెడ్డిలను ఆరు రోజుల పాటు పోలీసులు విచారణ చేయనున్నారు. హత్య కేసులో ప్రధాన కుట్రదారు లక్ష్మారెడ్డి, అమలు చేసింది యుగంధర్‌రెడ్డి అని పోలీసుల పేర్కొన్నారు. సూపారీ కిల్లింగ్‌లో ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో‌ పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. అదే విధంగా గోపన్పల్లి హేమంత్ కిడ్నాప్‌ స్థలం నుంచి సంగారెడ్డి హత్య స్థలం వరకు నిందితులను తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 21మందిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. చదవండి:(హ‌త్య‌కేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా