Sakshi News home page

మళ్లీ మావోల పాగా!

Published Fri, Sep 29 2023 1:13 AM

A Huge Encounter That Was Narrowly Missed - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణలో ఎన్నికల బహిష్కరణ నినా దం వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు సమాయత్తమవుతోంది. డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణలో పాగా వేసేందుకు సరైన సమయంగా పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి చేరే అవకాశం ఉందని పోలీసులను రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరించింది. ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు ములుగు జిల్లా పేరూరు శివారు కర్రెగుట్ట ప్రాంతంలో బుధవారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరగడం గమనార్హం. 
చంద్రన్న నేతృత్వంలో సాయుధ దళాలు..
రాష్ట్ర విభజనకు ముందు ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన పుల్లూరు ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న నేతృత్వంలో సాయుధ దళాలు మళ్లీ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడిగా, తెలంగాణ ఇన్‌చార్జ్‌గా ఉన్న చంద్రన్న.. రాబో యే ఎన్నికలే లక్ష్యంగా భారీ దాడులకు వ్యూహరచనతో తెలంగాణలో ప్రవేశించే క్రమంలో పేరూరు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో 30–40 మంది మావోయిస్టులు ఈ నెల 26న సమావేశమైనట్లు చెబుతున్నారు.

బడే దామోదర్‌ అలియాస్‌ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య అలియాస్‌ గోపన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌లతోపాటు ఓగోలపు మల్లయ్య, భద్ద్రు, ముచ్చకి ఉంగల్‌ (రఘు), కొవ్వాసి గంగ (మహె‹Ù, జనార్దన్‌), నల్లమారి అశోక్‌ (విజెందర్‌), సాంబయ్య (అజాద్‌), ముస్సాకి దేవల్‌ (కరుణాకర్‌), పొడియం కొసయ్య అలియాస్‌ మాసాలతోపాటు సుమారు 40 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనిపై కచి్చతమైన సమాచారం అందుకున్న ములుగు, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు గ్రేహౌండ్స్‌ బలగాలతో 2రోజులు అడవులను జల్లెడ పట్టారు.

పేరూరు అటవీ ప్రాంతం కర్రెగుట్ట వద్ద వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పు లు జరగ్గా ఆయుధాలతో మావోయిస్టులు తప్పించుకున్నారు. అయితే పెద్ద మొత్తంలో కిట్‌ బ్యాగులు, మందులు, బ్యాటరీ చార్జర్‌లు, వాట ర్‌ క్యాన్‌లు, సోలార్‌ ప్లేట్లు, సుతిలి బాంబులు, పార్టీ సాహిత్యం, వంట సామగ్రి లభ్యం కావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది.

అగ్రనేతలు లక్ష్యంగా కూంబింగ్‌
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మళ్లీ తెలంగాణ సరిహద్దుకు చేరారన్న సమాచారంతో పోలీసులు ఆ పార్టీ సాయు«ధ దళాల కదలికలపై దృష్టి పెట్టారు. ఉత్తర తెలంగాణ నుంచి మొత్తం 82 మంది వివిధ నక్సల్స్‌ గ్రూపులలో పనిచేస్తుండగా 8 మంది ప్రజాప్రతిఘటన, ఇద్దరు న్యూడెమోక్రసీలలో, మావోయిస్టు పారీ్టలో 72 మంది పనిచేస్తుండగా, 54 మంది ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఏవోబీ తదితర ప్రాంతాలలో వివిధ కేడర్‌లలో ఉన్నారు.

వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పనిచేస్తున్న వారిలో 16 మంది పూర్వ వరంగల్‌కు చెందినవారు కాగా, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ (కేకేడబ్ల్యూ), డివిజన్‌ కమిటీలను ఎత్తేసి ఎన్‌టీఎస్‌జడ్‌సీని తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్‌సీ)గా మార్చింది. రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ మృతి తర్వాత చంద్రన్న పర్యవేక్షణలో ఆ బాధ్యతలను బడే దామోదర్‌ చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఆయనతోపాటు కంకనాల రాజిరెడ్డి, బండి ప్రకాశ్‌ అలియాస్‌ క్రాంతి అలియాస్‌ ప్రభాత్, మైలారపు ఆదెల్లు అలియాస్‌ భాస్కర్, కొయ్యడ సాంబయ్య తదితర నేతల నిర్బంధం కారణంగా దండకారణ్యానికి మారారు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో సాయుధ దళాల రక్షణతో మళ్లీ తెలంగాణలో అడుగిడుతుండగా పోలీసులు ఆ దళాలు లక్ష్యంగా కూంబింగ్‌ ముమ్మరం చేశాయి.

Advertisement
Advertisement