రెండేళ్ల కుమారుడి ఆరోగ్యం కోసం రూ.16 కోట్లు | Sakshi
Sakshi News home page

రెండేళ్ల కుమారుడి ఆరోగ్యం కోసం రూ.16 కోట్లు

Published Sat, Apr 24 2021 1:55 AM

Hyderabad Family Seeks Public Help For 2 Year Old Sons Treatment - Sakshi

సాక్షి, జూబ్లీహిల్స్‌(హైదరాబాద్‌): ప్రపంచమంతా కోవిడ్‌ మహమ్మారితో పోరాడుతుంటే హైదరాబాద్‌కు చెందిన యోగేష్‌గుప్తా దంపతులు తమ రెండేళ్ల కుమారుడు ఆయాంశ్‌గుప్తా ప్రాణం కాపాడుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. స్పైనల్‌ మాస్క్యులర్‌ ఆట్రోపి(ఎస్‌ఎమ్‌ఏ) టైప్‌–1 అనే ప్రమాదకర జబ్బుతో బాధపడుతున్న చిన్నారిని కాపాడుకోవడానికి దాదాపు రూ.16 కోట్లు ఖర్చు అవుతుందని డాక్టర్లు తేల్చిచెప్పారు. దీంతో దిక్కుతోచని యోగేష్‌.. ప్రసిద్ధ క్రౌడ్‌ ఫండింగ్‌ వెబ్‌సైట్‌ ఇంపాక్ట్‌గురు.కామ్‌ను సంప్రదించాడు. ఇందుకు స్పందించిన సంస్థ ఆయాంశ్‌గుప్తా క్రౌడ్‌ఫండింగ్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించింది.

అజయ్‌దేవగన్, అనిల్‌కపూర్, రాజ్‌కుమార్‌రావు, ఆలియాభట్, దినేష్‌కార్తీక్‌ తదితర ప్రముఖులు సహా ప్రపంచ వ్యాప్తంగా 29వేల మంది స్పందించి ఇప్పటి వరకు రూ.6కోట్లను అందించినట్లు వెబ్‌సైట్‌ పేర్కొంది. ప్రస్తుతం బైపాస్‌ మెషీన్‌ ద్వారా అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటున్న ఆయాంశ్‌కు విరాళాలు అందించి ప్రాణాలు కాపాడాలని సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.  

Advertisement
Advertisement