Sakshi News home page

హైదరాబాద్‌ పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌: 8 రోజులు.. 1.66 లక్షల కేసులు!

Published Tue, Dec 14 2021 3:50 PM

Hyderabad Police Special Drive: 1 66 Lakh Traffic Violations in Eight Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో పోలీసు విభాగం ప్రత్యేక డ్రైవ్‌లకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 4 నుంచి వీటిని ప్రారంభించారు. అప్పటి నుంచి శనివారం వరకు జరిగిన స్పెషల్‌ డ్రైవ్స్‌లో మొత్తం 1.66 లక్షల కేసులు నమోదు చేసినట్లు నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. (జూబ్లీహిల్స్‌లో అదుపుతప్పిన బీఎండబ్ల్యూ.. 3 రోజుల కిందటే కొనుగోలు)

ట్రాఫిక్‌ అధికారులు, శాంతిభద్రతల విభాగంతో పాటు సిటీ ఆర్డ్మ్‌ రిజర్వ్‌ హెడ్‌–క్వార్టర్స్‌ నుంచి సిబ్బందిని కలిపి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఈ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నాయని, ఈ విధానం కొనసాగుతుందని కమిషనర్‌ తెలిపారు. వాహనచోదకులకు, ఎదుటి వారికీ ప్రాణసంకటంగా మారే ఉల్లంఘనలతో పాటు తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించే వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎనిమిది రోజుల్లో నమోదు చేసిన కేసుల గణాంకాలను కొత్వాల్‌ విడుదల చేశారు. (చదవండి: సారు చాలా బిజీ; కదలరు.. వదలరు..)

Advertisement

తప్పక చదవండి

Advertisement