అసెంబ్లీ నుంచి బహిష్కరించండి | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ నుంచి బహిష్కరించండి

Published Thu, Aug 25 2022 1:39 AM

Hyderabad: Political Leaders Responds Over Raja Singh Controversial Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని యాకుత్‌పురా ఎమ్మెల్యే(ఎంఐఎం) సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. ఇక రాజాసింగ్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ మండిపడగా.. రాష్ట్రాన్ని తగలబెట్టి శ్మశానాలు ఏలుతారా అంటూ టీఆర్‌ఎస్, బీజేపీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో మతఘర్షణలు చేయించడానికి సీఎం కుట్ర పన్నుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపణలు చేశారు.

అసెంబ్లీ నుంచి బహిష్కరించండి
శాసనసభ విలువలను దిగజా రుస్తున్న గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని యాకుత్‌పురా ఎమ్మెల్యే(ఎంఐఎం) సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బుధవా రం లేఖ రాశారు. ఎమ్మెల్యేగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించి సభ ప్రతిష్టకు భంగం కలిగించిన రాజాసింగ్‌పై రాజ్యాంగంలోని 194వ ఆర్టికల్‌ నిబంధనల మేరకు చర్యలు తీసుకునే అధికారం అసెంబ్లీకి ఉందని లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 22న మహ్మద్‌ ప్రవక్తను ఉద్దేశించి రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నా యన్నారు. ఈ ఏడాది అసెంబ్లీలోనూ అసంబద్ద వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన విషయాన్ని ఖాద్రి గుర్తు చేశారు. 
­రాజాసింగ్‌ను బహిష్కరించాలి

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
మతకల్లోలాలకు దారి తీసేలా, మత ఘర్షణలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సమాజ బహిష్కరణ చేయాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణపై బీజేపీ మిడతల దండులా దాడి చేస్తోందని, మత అలజడులను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బుధవారం భట్టి విలేక రులతో మాట్లాడారు. బీజేపీ నేతల తీరు దేశ సమైక్యత, సమగ్రత, లౌకికవా దానికి పెనుముప్పుగా మారుతోందన్నారు. రాజాసింగ్‌ తన స్థాయి మరిచి జుగుప్సకర వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. సమాజహితం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రాజాసింగ్‌ను కట్టడి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇతర మతా లను గౌరవించాలని, కానీ రాజాసింగ్‌ అందుకు భిన్నంగా మాట్లాడినందున భారత రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. 

మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారిని జైలుకు పంపండి: రేవంత్‌
మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ‘మత విద్వేషాలు రెచ్చగొట్టి, తాత్కాలిక రాజకీయ ప్రయోజనం పొందడానికి బీజేపీ ఎంతకైనా బరితెగిస్తుందని రాజాసింగ్‌ మాటలు ధ్రువీకరి స్తున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలోని వాస్తవాలను మరుగున పరచడా నికి టీఆర్‌ఎస్‌ కృత్రిమంగా సృష్టిస్తోన్న గందరగోళాన్ని కూడా ప్రజలు గమ నిస్తున్నారు’ అని రేవంత్‌ ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.  

రాజాసింగ్‌ను జైలుకు పంపాలి: అసదుద్దీన్‌ ఒవైసీ
మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను జైలుకు పంపాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన దారు స్సలాంలో మీడియాతో మాట్లాడారు. రాజాసింగ్‌ కు బెయిల్‌ రావడంపై మండిపడ్డారు. పోలీసుల పొరపాటుతో ఆయనకు జైలు తప్పిందని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు దీనిని సరిదిద్దుతారని ఆశిస్తు న్నానని పేర్కొన్నారు. రాజాసింగ్‌పై తీవ్ర ఆరో పణలు ఉన్నాయని, సహించరాని వివాదాస్పద వాఖ్యలతో ఆయన వీడియోను విడుదల చేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా రాజాసింగ్‌ వైఖరి అసభ్యకరంగా ఉందని ఒవైసీ నిప్పులు చెరిగారు. వివాదాస్పద వాఖ్యలు చేసిన రాజాసింగ్‌ వాయిస్‌ శాంపిల్స్‌ సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాలని అసదుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. వాయిస్‌ శాంపిల్‌ నిర్ధారణ ద్వారా బలమైన కేసు పెట్టాలని ప్రభు త్వానికి సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఇలాంటి వాఖ్యలు చేయడం ఇదే చివరిసారి కావాలని పేర్కొన్నారు. నుపుర్‌శర్మ వ్యవహారం నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోలేదని ఆయన దుయ్యబట్టారు.

ఎక్కడ కనిపించినా దాడి చేయండి: ఫిరోజ్‌ఖాన్‌
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మహ్మద్‌ ప్రవక్తనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే హైదరాబాద్‌ లోని ముస్లింలు రాజాసింగ్‌ ఎక్కడ కనిపించినా దాడి చేయాలని కాంగ్రెస్‌ నాయకుడు ఫిరోజ్‌ ఖాన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక మతాన్ని కించప రిచేలా మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్య మాల్లో బుధవారం ఆయన ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో ఫిరోజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. శాంతి, సమానతలతో ఉన్న హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేలా రాజాసింగ్‌ వ్యాఖ్యలున్నాయని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకుని జైల్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement