పీజీ సీట్ల భర్తీకి  ప్రత్యేక కౌన్సెలింగ్‌ | Sakshi
Sakshi News home page

పీజీ సీట్ల భర్తీకి  ప్రత్యేక కౌన్సెలింగ్‌

Published Tue, Feb 8 2022 4:25 AM

Hyderabad: Special Counselling For Pg Courses Entrances Ugc Chairman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు అన్ని యూనివర్సిటీల నుంచి వివరాలను కోరినట్లు మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. వివిధ కారణాల వల్ల గతంలో కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పారు. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా పీజీ కోర్సులకు సంబంధించిన 52 వేల సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్ప టివరకు మూడు దశల్లో కౌన్సెలింగ్‌ చేపట్టారు.

అయితే అందులో 24 వేలమంది ప్రవేశాలు పొందగా.. ఇంకా 28 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి.  ఆర్ట్స్‌ గ్రూపుల్లో తక్కువ సంఖ్యలో చేరారన్నారు. అయితే, గ్రాడ్యుయేట్‌ కోర్సులు చేసిన కొంతమందికి బ్యాక్‌లాగ్స్‌ ఉండటంతో వీటిని ఇటీవల జరిగిన పరీక్షల్లో పూర్తిచేశారు. కానీ ఫలితాలు వచ్చే నాటికి పీజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో పలు విద్యార్థి సంఘాలు ఉన్నత విద్యా మండలి దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చాయి. ఫలితంగా అధికారులు చర్చించి చివరి దశ కౌన్సెలింగ్‌ చేపట్టాలని నిర్ణయించారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement