Sakshi News home page

రోబోలు మనుషుల స్థానాన్ని భర్తీ చేయలేవు

Published Fri, Jun 24 2022 1:44 AM

Hyderabad: Task CEO Srikanth Sinha Speech At Launch Of H Labs At T Hub - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మారుతున్న కాలానికి అనుగుణంగా రోబోలు మనుషులకు మద్దతు మాత్రమే ఇస్తాయని, మనుషుల స్థానాన్ని భర్తీ చేయవని తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) సీఈఓ శ్రీకాంత్‌ సిన్హా తెలిపారు. రోబోలను తయారు చేయ డానికి, వాటి సేవలను విస్తృతపరచడానికి నగరంలోని టి–హబ్‌ వేదికగా అతిపెద్ద రోబోటిక్స్‌ ఆర్‌ అండ్‌ డి ఎకో సిస్టమ్‌తో హెచ్‌–ల్యాబ్‌ను హెచ్‌–బోట్స్‌ ఆవిష్క రించింది.

గురువారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా హాజరైన టాస్క్‌ సీఈఓ శ్రీకాంత్‌ సిన్హా, తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ ఇన్నోవేటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శాంత థౌతం లు మాట్లాడుతూ.. జనాభాలో 15 శాతం మంది వికలాంగులు ఉన్నారని, వారు సాధారణ జీవితాన్ని గడపడానికి సహాయపడే రోబోలను తప్పనిసరిగా తయారు చేయాలని హెచ్‌–బోట్స్‌ను కోరారు. కొత్త ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి రాష్ట్ర ఇన్నో వేషన్‌ సెల్‌ విశేషంగా కృషి చేస్తోందని డాక్టర్‌ శాంత థౌతం తెలిపారు. హెచ్‌–ల్యాబ్‌లతో రోబోటిక్స్‌ రంగంలో వినూత్న ఆవిష్కరణలను తీసుకురానున్నామని ఫౌండర్‌ కిషన్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement