కాళేశ్వరం ఖర్చు రూ. 80,321.57 కోట్లు | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం ఖర్చు రూ. 80,321.57 కోట్లు

Published Fri, Dec 17 2021 3:43 AM

Kaleshwaram Project Has So Far Cost Rs 80321 Cr - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు సాగునీరు, వరద నియంత్రణ, బహుళార్థ సాథక ప్రాజెక్టుల సలహా కమిటీ 2018 జూన్‌లోనే ఆమోదం తెలిపిన ట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకా వత్‌ వెల్లడించారు. సొంత నిధులతోనే ఈ ప్రాజెక్టు ను చేపడుతున్నామని, ఈ ఏడాది అక్టోబర్‌ చివరి నాటికి 83.7 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలం గాణ ప్రభుత్వం తెలిపిందన్నారు. 

ఈ ప్రాజెక్టుపై రాష్ట్రం ఇప్పటివరకు రూ. 80,321.57 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు షెకావత్‌ సమాధానమిచ్చారు. కాళేశ్వరం ద్వారా 18.25 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపా దించగా అదనంగా 18.82 లక్షల ఎకరాలను సైతం స్థిరీకరించేలా 240 టీఎంసీల నీటిని వినియోగించ నున్నట్లు రాష్ట్రం తెలిపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు వివిధ రుణ సంస్థ లు రూ. 86,064 కోట్లు మంజూరు చేయగా ఇందు లో రూ. 59,539.51 కోట్లు విడుదల చేశాయని మంత్రి వివరించారు. ప్రాజెక్టు వ్యయాన్ని సలహా కమిటీ 2015–16 ధరల ప్రకారం రూ. 80,190.46 కోట్లుగా ఖరారు చేసిందన్నారు. అదనంగా చేపట్టిన పనులకు సంబంధించి సలహా కమిటీ పరిశీలనకు  ప్రతిపాదనలేవీ సమర్పించలేదన్నారు. 

20,878 మంది నిర్వాసితులు...
కాళేశ్వరం ప్రాజెక్టుతో 20,878 మంది నిర్వాసితు లయ్యారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన మ రో ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ సమాధానమిచ్చారు. ప్రాజెక్టు కారణంగా ప్రభావితం అవుతున్న వారిని బలవంతంగా తరలించట్లేదని రాష్ట్రం తెలిపిందన్నారు.

Advertisement
Advertisement