ప్రీతి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చింది.. ఆత్మహత్యకు అతడే ప్రధాన కారణం: వరంగల్‌ సీపీ రంగనాథ్

21 Apr, 2023 18:16 IST|Sakshi

సాక్షి, వరంగల్:  కాకతీయ మెడికల్‌ కాలేజీ మెడికో ధారవత్ ప్రీతి నాయక్ మృతి కేసులో సస్పెన్స్‌ వీడింది. ఆమెది ఆత్మహత్యేనని ప్రకటించారు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌. ఈ మేరకు పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ వచ్చిందని ప్రకటించారాయన. ప్రీతిది ఆత్మహత్యేనని స్పష్టం చేసిన ఆయన.. ఇందుకు సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ ప్రధాన కారణమని శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. 

పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకున్నట్లు భావిస్తున్నాం. ఐపీసీ సెక్షన్‌ 306 కింద చర్యలు తీసుకుంటున్నాం. ప్రీతి ఆత్మహత్య కు సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ప్రధాన కారణం. వారం పదిరోజుల్లో చార్జి షీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్‌ తెలిపారు.

ఇదిలా ఉంటే.. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్‌కు వరంగల్‌ కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య 16వారాల పాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని సైఫ్‌ బెయిల్‌ ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. సైఫ్‌కు బెయిల్‌పై విడుదలైన మర్నాడే ప్రీతి సూసైడ్‌ కేసులో వరంగల్‌ సీపీ కీలక ప్రకటన చేయడం గమనార్హం.

ఇదీ చదవండి: నరబలి కాదు.. ఆర్థిక వివాదాలే కారణం
 

మరిన్ని వార్తలు