బాసర ట్రిపుల్‌ ఐటీ: స్పందించిన కేటీఆర్‌.. ఆపై చర్చలు విఫలం.. | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ ఐటీ: స్పందించిన కేటీఆర్‌.. ఆపై చర్చలు విఫలం..

Published Wed, Jun 15 2022 3:44 PM

KTR Responds To Student Concern At Basra IIIT - Sakshi

బాసర ట్రిపుల్‌ ఐటీలో(రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం)లో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ట్రిపుల్‌లో తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నామని విద్యార్ధులు.. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. కాగా, బుధవారం విద్యార్థులుతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అధికారుల ముందు విద్యార్థులు 12 డిమాండ్లను ఉంచారు. కాగా, విద్యార్థులు డిమాండ్లకు అధికారులు ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమైనట్టు సమాచారం. దీంతో, విద్యార్థులు తలపెట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

అంతకుముందు విద్యార్థులు.. మెస్‌లో భోజనం సరిగా లేదని, కరెంట్‌ ఉండటం లేదని, వాటర్‌ సమస్య వెంటాడుతోంది ఆరోపించారు. అలాగే, విద్యార్థులకు కనీసం ల్యాప్ టాప్స్‌ కూడా ఇవ్వడంలేదని ఆదేవన వ్యక్తం చేశారు. ఇక, రెండు సంవత్సరాల నుండి బాసర ట్రిపుల్‌ ఐటీ లోపలికి మీడియాను అధికారులు అనుమతించడం లేదని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. వారికి కూడా లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే కూర్చుని నిరసనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలోనూ విద్యార్థులకు పెట్టే భోజనంలో బొద్దింకలు, బల్లులు రావడంతో వారు ఆందోళన చేపట్టారు. 

మరోవైపు.. విద్యార్థుల ఆందోళనలపై ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ట్రిపుల్‌ ఐటీలో సమస్యలను తెలంగాణ సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ట్రిపుల్‌ ఐటీ విద్యా నాణ్యతను పెంచేందుకు, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, ఆందోళన చెందకండి అంటూ ట్విట్టర్‌ వేదికగా హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ట్రిపుల్‌ ఐటీలో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ విషయంపై బుధవారం.. వైస్‌ ఛాన్స్‌లర్‌(వీసీ)తో సమావేశం కానున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: చదువు చెప్పే గురువులేరి?

Advertisement
Advertisement