సూర్యాపేట జిల్లాలో స్వల్ప భూకంపం 

30 Sep, 2023 08:09 IST|Sakshi

హుజూర్‌నగర్‌: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలో శుక్రవారంరాత్రి మళ్లీ స్వల్ప భూకంపం వచ్చింది. పలు గ్రామాలతోపాటు పులిచింతల ప్రాజెక్టు ప్రాంతంలో కూడా స్వల్పంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు పలువురు తెలిపారు. దాదాపు 5 నుంచి 10 సెకండ్లపాటు భూమి కంపించింది. ఈ ప్రకంపనలను కొద్దిమంది మాత్రమే గుర్తించినట్లు చెబుతున్నారు.

ఈ నెల 19న ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి కేంద్రంగా వచ్చిన భూకంపం 2.3 మ్యాగ్నట్యూడ్‌గా నమోదైంది. కాగా, 2020, 2022 సంవత్సరాల్లో కూడా పలుమార్లు భూప్రకంపనలు సంభవించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం వచ్చిన భూకంపం 3.0 మ్యాగ్నట్యూడ్‌గా నమోదైంది. ఇప్పడు మళ్లీ భూకంపం రావడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 

మరిన్ని వార్తలు