సూర్యాపేటలో విషాదం.. అయ్యప్ప పడిపూజకు వెళ్లి వస్తుండగా ప్రమాదం

13 Nov, 2022 08:12 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 

వివరాల ప్రకారం.. అయ్యప్పస్వాములు పడిపూజకు వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 33 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. కాగా, దారుణ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.  


 

మరిన్ని వార్తలు