ఒకేసారి 15 మందికి..

30 Oct, 2021 04:25 IST|Sakshi
పిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌

మున్సిపల్‌ శాఖలో బదిలీలు 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ శాఖలో భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ల నుంచి మొదలుకొని స్పెషల్‌ గ్రేడ్, గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 స్థాయి మున్సిపల్‌ కమిషనర్ల వరకు స్థానభ్రంశం కల్పించారు.  ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.  ఒకేసారి 15 మందికి స్థానభ్రంశం కల్పించారు. త్వరలో మరిన్ని బదిలీలు జరిగే అవకాశముంది.

మున్సిపల్‌ బదిలీలు ఇవే.. 
జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ జె.శంకరయ్య నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా.. జీహెచ్‌ఎంసీలోనే అదనపు కమిషనర్‌గా ఉన్న సీహెచ్‌ నాగేశ్వర్‌ను మీర్‌పేట కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమించారు. పిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా జీహెచ్‌ఎంసీ డిప్యూటీ డైరెక్టర్‌ (వెటర్నరీ) రామకృష్ణారావు.. జీహెచ్‌ఎంసీ జాయింట్‌ కమిషనర్‌ పి.రవీందర్‌ సాగర్‌ మిర్యాలగూడ మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. మేడ్చల్‌ మున్సిపాలిటీ కమిషనర్‌ బి.సత్యనారాయణరెడ్డిని నిర్మల్‌ మున్సిపాలిటీకి బదిలీ చేశారు. సీడీఎంఏ సూపరింటెండెంట్‌ ఎస్‌.వి.జానకిరామ్‌ సాగర్‌ను గద్వాల మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించగా.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కమిషనర్‌ కె.జయంత్‌కుమార్‌రెడ్డిని షాద్‌నగర్‌కు బదిలీ చేశారు.

గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ కె.అమరేందర్‌రెడ్డిని ఆదిబట్ల మున్సిపాలిటీకి బదిలీ చేయగా.. గుండ్లపోచంపల్లికి కమిషనర్‌గా డి.లావణ్యకు పోస్టింగ్‌ ఇచ్చారు. టీయూఎఫ్‌ఐడీసీ ఎండీ ఎంఎన్‌ఆర్‌ జ్యోతిని తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ కమిషనర్‌గా.. సీడీఎంఏ జాయింట్‌ డైరెక్టర్‌ కె.ఫల్గున్‌కుమార్‌ను మణికొండ మున్సిపాలిటీకి కమిషనర్‌గా నియమించారు. స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.జయంత్‌ను సీడీఎంఏ జాయింట్‌ డైరెక్టర్‌గా నియమించగా.. జీహెచ్‌ఎంసీ జాయింట్‌ కమిషనర్‌ మహ్మద్‌ యూసఫ్‌ను ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించారు. మేడ్చల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా సఫీయుల్లా నియమితులయ్యారు. డీఎల్‌పీఓ ఎ.జ్యోతిరెడ్డిని జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమించారు.

మరిన్ని వార్తలు