నాగార్జున సాగర్‌కు జలకళ | Sakshi
Sakshi News home page

నాగార్జున సాగర్‌కు జలకళ

Published Sat, Jul 31 2021 2:57 AM

Nagarjuna Sagar Was Flooded By Heavy Rains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదిలో భారీ వరదతో నాగార్జున సాగర్‌ జలకళను సంత రించుకుంది. మొత్తంగా 312 టీఎంసీల సామర్థ్యానికిగాను.. శుక్రవారం సాయం త్రానికి నీటి నిల్వ 232 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి నాలుగు లక్షల క్యూసెక్కు లకుపైగా వరద ప్రవాహం కొనసాగు తోంది. అంటే రోజుకు సుమారు 35–40 టీఎంసీల మేర నీరు చేరుతుందని.. మూడు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఎగువన జూరాల నుంచి కూడా భారీ ప్రవాహం కొనసాగుతుండటంతో త్వరలోనే సాగర్‌ గేట్లు ఎత్తడం ఖాయమని తెలిపాయి.

నది నిండా ప్రవాహం
పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురు స్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల్లోకి వరద ఉద్ధృతి కొనసాగు తోంది. ఆ ప్రాజెక్టుల్లో వచ్చిన నీటిని వచ్చి నట్టుగా దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు భారీగా వరద వస్తోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో జూరాలకు 4.67 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని.. 47 గేట్లు ఎత్తి 4.75 లక్షల క్యూసె క్కులను దిగువకు వదులుతు న్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4,63,952 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. క్రస్టు గేట్లు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తు న్నారు.

శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి నాగార్జునసాగర్‌లో 560 అడు గుల మట్టం వద్ద 232.62 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఇక సాగర్‌లో విద్యుదు త్పత్తి చేస్తూ వదులుతున్న నీటిలో 27,873 క్యూసెక్కులు పులిచింతల ప్రాజెక్టుకు చేరు తున్నాయి. తెలంగాణ సర్కారు పులి చింతలలో విద్యుదుత్పత్తి చేస్తూ 18,370 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీకి వదులు తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి 7,912 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు, 10,458 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తు న్నారు. ఇక పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్రలో వరద తగ్గుతోంది. డ్యామ్‌లోకి 52,140 క్యూసెక్కులు చేరుతుండగా 29,500 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

Advertisement
Advertisement