Natu Kodi Chicken Special Curry and Rice Order Price Hike - Sakshi
Sakshi News home page

Natu Kodi Curry: ధర పెరిగినా తగ్గేదే లే!.. రూ.900 పెట్టాల్సిందే.. ఆర్డర్లు ఇవ్వాల్సిందే!

Published Wed, Feb 16 2022 1:16 PM

Natu Kodi Chicken Special, Curry And Rice Order Price Hike - Sakshi

సాక్షి, ఆర్మూర్‌(నిజామాబాద్‌): ఆర్మూర్‌ ప్రాంతంలోని ఆర్డర్‌ మెస్‌ల్లో లోకల్‌ దేశీ కోళ్ల కొరతతో దేశీకోడి ధర కొండెక్కి కూర్చుంది. పల్లెల్లోని ఇళ్లలో పెంచిన దేశీ కోళ్లు అందుబాటులో లేకపోవడంతో ఆర్డర్‌ మెస్‌ల నిర్వాహకులు ధరలను పెంచివేశారు. భోజనప్రియుల నుంచి లోకల్‌ దేశీ కోడినే వండి ఇవ్వాలనే డిమాండ్‌ అధికంగా ఉండటంతో ఒక దేశీకోడి, నలుగురు వ్యక్తులు తినగలిగే అన్నం వండి ఇవ్వడానికి రూ.900 ధర నిర్ణయించారు. ఈ ధర గతంలో రూ.650 మాత్రమే ఉండేది. ఏకంగా రూ.250 పెంచినా లోకల్‌ దేశీకోడిని మాత్రమే తినాలనే భోజన ప్రియులు ఈ ధరను సైతం లెక్క చేయకుండా ఆర్డర్లు ఇస్తూనే ఉన్నారు.

ఆర్మూర్‌ ప్రాంతంలో ప్రతీ గ్రామంలో వెలిసిన ఆర్డర్‌ మెస్‌ల నిర్వాహకులు చుట్టు పక్కల గ్రామాలతో పాటు అంగళ్లలో లోకల్‌ దేశీకోళ్లను కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేసిన కోళ్లను తమ ఆర్డర్‌ మెస్‌లో వండి ఇస్తుంటారు. భోజన ప్రియుల నుంచి డిమాండ్‌ అధికంగా ఉండటంతో సరిపడా లోకల్‌ దేశీకోళ్లు లభించడం లేదు. దీంతో కొందరు ప్రత్యేకంగా ఫామ్‌లలో దేశీ కోళ్లను పెంచుతూ స్వయం ఉపాధి కల్పించుకున్నారు.
చదవండి: రోడ్డు ప్రమాదం: మానవత్వం చాటుకున్న మంత్రి ‘గంగుల’


అంకాపూర్‌లో ఆర్డర్‌ మెస్‌ వద్ద దేశీ కోళ్లు 

అయితే లోకల్‌ దేశీకోడి రుచికి ఫామ్‌లో పెంచిన దేశీకోడి రుచికి మధ్య తేడా ఉండటంతో భోజన ప్రియులు లోకల్‌ కోడికే ప్రాధాన్యనిస్తున్నారు. ఆర్డర్‌ మెస్‌ల నిర్వాహకులు గ్రామాల్లో గతంలో రూ.320కి ఒక కోడిని కొని తెచ్చేవారు. ప్రస్తుతం రూ.420 వరకు వెచ్చించి లోకల్‌ కోళ్లను కొ నుగోలు చేస్తున్నారు. ఈ కోడి ధరకు వంట సామగ్రికి అయ్యే ఖర్చు, తమ శ్రమను జోడించి ఆర్డర్‌ మెస్‌ నిర్వాహకులు ఒక దేశీ కోడి ఆర్డర్‌ను రూ.850 నుంచి రూ.900 పెంచేసి అమ్ముతున్నారు.  
చదవండి: హైదరాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కీలక ఆదేశాలు.. ‘ఇకపై వేసేయడమే’

Advertisement
Advertisement