మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వలేం: ఈటల

29 Apr, 2021 14:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కోవిడ్‌ ఉధృతిని అంచనా వేయడంలో కేంద్రం విఫలమైందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. కోవిడ్ విషయంలో రాష్ట్రాలకు కేంద్రం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఈ మేరకు  హైదరాబాద్‌లో గురువారం మాట్లాడుతూ.. కరోనాపై ముందుగా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. వ్యాక్సిన్లు, ఇంజక్షన్ల సరఫరాలో కేంద్రానికి ముందుచూపు లేదన్న ఈటల తెలంగాణపై కేంద్ర పెద్దల ఆరోపణలు అర్ధరహితమని దుయ్యబట్టారు.

కేంద్రం చేయాల్సిన తప్పులన్నీ చేసి రాష్ట్రాలను నిందించడం సరికాదని మంత్రి ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా కేసులు, మరణాలపై తప్పుడు వార్తలు ఇస్తున్నారని విమర్శలు సంధించారు. అదే విధంగా తెలంగాణలో లాక్‌డౌన్‌ ఆలోచన లేదని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ సాధ్యం కాదని స్పష్టం చేశారు. వ్యాక్సిన్లు వస్తే వేస్తాం కానీ.. ప్రస్తుతం వ్యాక్సినేషన్ సాధ్యం కాదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు