ఇప్పటివరకు రూ.387.90 కోట్లు పంపిణీ

2 Nov, 2020 08:07 IST|Sakshi

వరద బాధితులకు సాయంపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

సాక్షి,హైదరాబాద్‌: నగరంలో వరదలతో నష్టపోయి ఇప్పటి వరకు నగదు సహాయం అందని బాధిత కుటుంబాలకు వారి ఇంటివద్దే నగదు పంపిణీని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత కుటుంబాలకు నగదు పంపిణీపై ఆదివారం బి.ఆర్‌.కె.ఆర్‌.భవన్‌లో మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌లతో ఆయన సమీక్ష నిర్వహించారు.  చదవండి: ఎగసిపడ్డ జ్వాల.. తిరగబడ్డ వరద బిడ్డ

వరద బాధితులకు ఇప్పటివరకు రూ.387.90 కోట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం మున్సిపల్‌ శాఖకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస, ఆర్థికసాయం కోసం రూ.550 కోట్లను మంజూరు చేయగా ఇప్పటివరకు వరదలతో నష్టపోయిన 3.87లక్షల కుటుంబాలకు నగదు పంపిణీ చేసినట్లు వివరించారు. చదవండి: హైదరాబాద్‌ మెట్రో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఇలా.. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా