పంజాగుట్ట డ్రగ్స్‌ కేసు: స్టాన్లీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ప్రముఖల పేర్లు

13 Feb, 2024 15:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంజాగుట్ట డ్రగ్స్‌ కేసు నిందితుడు స్టాన్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్‌తో స్టాన్లీ పట్టుబడ్డ విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పలువురు ఏజెంట్లను స్టాన్లీ రిక్రూట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టాన్లీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ప్రముఖల పేర్లు ఉండటం గమనార్హం.

స్టాన్లీ డ్రగ్స్‌ లింక్స్.. పోలీసుల కస్టడీ విచారణలో ఒక్కొ‍క్కటిగా బయటపడుతునన్నాయని పోలీసులు పేర్కొన్నారు. అతనికి నైజీరియాలో డ్రగ్స్‌ తయారీదారులతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 500 మందితో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు