Sakshi News home page

ప్రీతి హత్య కేసు.. సైఫ్‌కి బెయిల్‌ మంజూరు 

Published Thu, Apr 20 2023 8:49 AM

PG Medico Preethi Case: Bail Granted For Accused Saif Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి హత్య కేసులో నిందితుడు సీనియర్‌ విద్యార్థి డాక్టర్‌ సైఫ్‌కి ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి సత్యేంద్ర షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. 60 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ బుధవారం నాటికి 58 రోజులు అవుతున్న సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టు ఎదుట వాదనలు విన్పించారు. వాదనల అనంతరం కోర్టు సైఫ్‌కి బెయిల్‌ మంజూరు చేసింది.

అయితే చార్జి షీట్‌ దాఖలు చేసేనాటికి లేదా 16 వారాల వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధిత విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని షరతు విధించింది. వ్యక్తిగతంగా రూ.10 వేల బాండ్, ఇద్దరు జమానత్‌దారుల పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో సాక్షులపై కానీ, మృతురాలి కుటుంబ సభ్యులపై కానీ ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని, నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో ప్రాసిక్యూషన్‌ వారికి బెయిల్‌ రద్దు కోరే అవకాశం ఇస్తూ కోర్టు ఆదేశించింది. 
చదవండి: లండన్‌లో హైదరాబాద్‌ యువతి మృతి.. సెలవు తీసుకుని ఇంటికొస్తానని చెప్పి..

Advertisement

తప్పక చదవండి

Advertisement